ప్రాదేశిక ఎన్నికలకు టీడీపీ దూరం

by సూర్య | Sat, Apr 03, 2021, 12:05 PM

గత ఏడాది ఎక్కడ నిలిచిందో అక్కడి నుంచే ప్రాదేశిక పోరుకు తెరలేచింది. జిల్లాలో ప్రచారాలు ప్రారంభమయ్యాయి. అధికార పార్టీ వైసీపీ నేతలు, కార్యకర్తలు ప్రచారాలు ప్రారంభించారు. ప్రతిపక్షం ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. దీంతో వారు ప్రచారాలు ప్రారంభించలేదు. తమ పార్టీ సరైన నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయాన్ని నేతలు వ్యక్తం చేస్తున్నారు.


ప్రాదేశిక ఎన్నికలను బహిష్కరిస్తున్నామని శుక్రవారం చంద్రబాబు నాయుడు ప్రకటించిన తర్వాత మండల పార్టీ సమావేశాలను టీడీపీ నిర్వహించింది. పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ ఎన్నికల్లో పాల్గొనకూడదని మండల పార్టీలు తీర్మానం చేశాయి. నామినేషన్‌ల ఘట్టం ఇప్పటికే ముగియడంతో బ్యాలెట్‌ పత్రాలపై టీడీపీ అభ్యర్థులు పోటీలోనే ఉన్నట్లు వస్తుంది. ప్రచారం నిర్వహించకూడదని నిర్ణయించుకున్నాయి.టీడీపీతో పాటు బీజేపీ, జనసేన కూడా ఈ ఎన్నికలను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని మొదటి నుంచి ఆ పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నాయి.


జిల్లాలో ఏకగ్రీవాలు తక్కువగానే ఉన్నాయి. జిల్లాలో జడ్పీటీసీలు 4. 34శాతం ఏకగ్రీవం కాగా, ఎంపీటీసులు 9. 54శాతం ఏకగ్రీవం అయ్యాయి. టీడీపీ ఎన్నికలను బహిష్కరించడంతో అంతా అధికార పక్షంగానే ప్రచారం సాగనుంది. గత ఏడాది నామినేషన్ల ఘట్టం ముగిసిన తర్వాత ఎన్నికలను నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. అప్పటికి జిల్లాలో రెండు జడ్పీటీసీలు ఏకగ్రీవం అయ్యాయి.


ఈ రెండు వైసీపీ దక్కించుకొంది. 69 ఎంపీటీసీలు ఏకగ్రీవం అయ్యాయి. వీటిలో 67 వైసీపీ, 2 టీడీపీ దక్కించుకుంది. 44 మండలాల్లో ప్రాదేశిక నియోజకవర్గాలకు పోటీ నెలకొంది. కృష్ణా జిల్లా పరిషత్తు పీఠం రెండో సారి జనరల్‌ మహిళకు రిజర్వు అయింది.


జిల్లాలో మొత్తం 53 మండలాలు ఉన్నాయి. వీటిలో నాలుగు మండలాలు అర్బన్‌ మండలాలుగా ఉన్నాయి. 49 మండలాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా వివిధ కారణాలతో జగ్గయ్యపేట, బందరు, పెనమలూరు మండలాలకు ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన 46 మండలాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో రెండు జడ్పీటీసీలు ఏకగ్రీవం కావడం విశేషం. గత ఎన్నికల్లో జిల్లాలో జడ్పీ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.


టీడీపీ తరఫున ఉంగుటూరు నుంచి పోటీ చేసిన గద్దె అనురాధ జడ్పీ పీఠాన్ని అధిరోహించారు. నాటి ఎన్నికల్లో టీడీపీ మొత్తం 49 మండలాలకు 34 స్థానాలను గెలుచుకుంది. వైసీపీ 15 స్థానాలకే పరిమితమైంది. ఎంపీపీ స్థానాలను టీడీపీ 36 దక్కించుకుంది.


ప్రస్తుతం ఉంగటూరు, మండవల్లి జడ్పీటీసీలు ఏకగ్రీవం అయ్యాయి. రెండూ వైకాపా దక్కించుకుంది.


ఏకపక్షమే టీడీపీ ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడంతో జిల్లాలో ఏకపక్షం కానున్నాయి.


కొన్ని స్థానాల్లో టీడీపీ గట్టి పోటీ ఇచ్చే స్థాయి ఉంది. కానీ ఎన్నికలకు దూరంగా ఉండాలని పార్టీ నిర్ణయంతో ప్రచారం ప్రారంభించలేదు. తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం, గన్నవరం తదితర నియోజకవర్గాల్లో వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. టీడీపీ బహిష్కరిస్తుందన్న నిర్ణయం వైసీపీ వర్గాల్లో చర్చకు దారి తీసింది.


తమకు ఎన్నికల వ్యయం మిగిలినట్లు వ్యాఖ్యానిస్తున్నారు. పోటీ ఉండే ప్రచార, ప్రలోభాల వ్యయం తడిసి మోపెడయ్యేది. ప్రస్తుతం ఆ భారం లేకుండానే గెలుపు అవకాశాలకు మార్గం సుగమమైందని అంటున్నారు. కొన్నిచోట్ల స్వతంత్రులు పోటీ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రతిపక్షం టీడీపీ పోటీ లేకుండా ఏకపక్షంగా సాగే ఎన్నికలపై గ్రామాల్లో అంతగా ఆసక్తి లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Latest News

 
ప్రభాస్ మద్దతు ఆ పార్టీకే.. ప్రచారం కూడా చేస్తున్న కృష్ణంరాజు సతీమణి Wed, May 08, 2024, 10:16 PM
ఒంటరిగా కారులో మహిళ.. 5 నిమిషాల్లోనే పని ముగించిన ఇద్దరు దుండగులు Wed, May 08, 2024, 09:05 PM
ఏపీలో మరికొందరు పోలీసులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Wed, May 08, 2024, 09:00 PM
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆసక్తికర సన్నివేశం,,,పోస్టల్ బ్యాలట్ ఓటర్ల కాళ్లపై పడ్డ వైసీపీ నేతలు Wed, May 08, 2024, 08:56 PM
గద్దె రామ్మోహన్‌రావుపై సంచలన ఆరోపణలు..ఎన్నికలకు ముందు కుట్ర Wed, May 08, 2024, 08:52 PM