నందీగ్రామ్‌లో ఓటు వేసిన సువేందు అధికారి

by సూర్య | Thu, Apr 01, 2021, 08:46 AM

 పశ్చిమ బెంగాల్, అసోంలలో ఈరోజు అసెంబ్లీ ఎన్నికల రెండవ దశ పోలింగ్ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్‌లో 30 అసెంబ్లీ సీట్లకు గాను 171 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అసోంలో 30 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా 345 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఈ రోజు జరుగుతున్న పోలింగ్‌లో అందరి దృష్టి బెంగాల్‌లోని నందిగ్రామ్‌పైనే ఉంది. ఈ సీటు నుంచి మమతా బెనర్జీ, సువేందు అధికారి పోటీ చేస్తున్నారు.కాగా బీజేపీ తరపున పోటీ చేస్తున్న సువేందు అధికారి ఈరోజు ఉదయాన్నే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. నందీగ్రామ్‌లోని పోలింగ్ బూత్ నంబరు 76 లో ఆయన ఓటు వేశారు. మోటార్ సైకిల్‌పై పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆయన ఈరోజు ఉదయం 8 గంటలకు ఓటు వేశారు. ఒకవైపు ఓటింగ్ జరుగుతుండగా, మరోవైపు టీఎంసీ నేతలు ప్రత్యర్థులపై పలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. టీఎంసీ మద్దతుదారులను ఓటువేయకుండా అడ్డుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు.

Latest News

 
టీ టైమ్ ఉదయ్ పోలింగ్ టైమ్ లో రాణిస్తారా..! కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిపై కూటమి నేతల గుర్రు. Tue, Apr 30, 2024, 10:46 PM
పోలీసులను చూడగానే డ్రైవర్ తత్తరపాటు..కారు ఆపి చెక్ చేస్తే వామ్మో. Tue, Apr 30, 2024, 09:18 PM
టీ టైమ్ ఉదయ్ పోలింగ్ టైమ్ లో రాణిస్తారా Tue, Apr 30, 2024, 09:16 PM
పోలీసులను చూడగానే డ్రైవర్ తత్తరపాటు..కారు ఆపి చెక్ చేస్తే వామ్మో Tue, Apr 30, 2024, 09:10 PM
మల్లెతోటలో బ్రాహ్మణి.. లోకేష్ కోసం ప్రచారం చేస్తూ Tue, Apr 30, 2024, 09:07 PM