తగ్గిన వంట గ్యాస్‌ ధరలు

by సూర్య | Thu, Apr 01, 2021, 08:13 AM

గత మూడు నెలల్లోనే భారీగా వంటగ్యాస్‌ ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే.. వంట గ్యాస్‌ ధర నుంచి తగ్గనుందని ఆయిల్‌ కంపెనీలు పేర్కొన్నాయి. ఏప్రిల్‌ 1 నుంచి సిలిండర్‌పై రూ. 10 తగ్గనుంది. ఫిబ్రవరిలో వరుసగా ధరల పెరుగుదల ప్రభావంతో ఉన్న గృహిణులకు ఉపశమనం కలిగించేలా గ్యాస్‌ ధర తగ్గింది. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ బుధవారం సిలిండర్‌ ధరలో రూ.10 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఇప్పటికే వారంలో మూడుసార్లు తగ్గించినప్పటికీ, వంట గ్యాస్‌ ధర కూడా సమీప భవిష్యత్తులో తగ్గుతాయని చమురు అధికారులు పేర్కొంటున్నారు. కాగా.. తాజా తగ్గింపుతో ఢిల్లీలో రూ. 819 ఉన్న 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ. 809 కి చేరుతుంది. ఇతర మార్కెట్లలోనూ తగ్గించిన ధర అమల్లో ఉంటుందని కంపెనీలు పేర్కొన్నాయి.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM