ఆ అరుదైన రికార్డుకు నేటితో 20 ఏళ్లు

by సూర్య | Wed, Mar 31, 2021, 02:10 PM

ఇండియన్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ 20 ఏళ్ల క్రితం ఇదే రోజున ఓ అరుదైన రికార్డును సృష్టించాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌ చరిత్రలో 10 వేల పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. 2001 మార్చి 31న ఇండోర్‌ లోని నెహ్రూ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ లో సచిన్ ఈ ఘనత సాధించాడు. ఆ మ్యాచ్‌ లో వీవీఎస్ లక్ష్మణ్‌ తో కలిసి సచిన్ 199 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ మ్యాచ్ లో సచిన్ సెంచరీ చేశాడు. వన్డే‌ల్లో 10 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. తన 259వ వన్డే ఇన్నింగ్స్‌లో సచిన్ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆ మ్యాచ్ లో సచిన్ 139 పరుగులతో రాణించడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 299 పరుగులు సాధించింది. ఆస్ట్రేలియా కేవలం 181 పరుగులకే ఆలౌట్ కావడంతో 118 పరుగుల తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది.

Latest News

 
సింహాచలం వెళ్లే భక్తులకు శుభవార్త.. తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా! Sat, Apr 27, 2024, 09:31 PM
వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా.. సాయంత్రానికి టీడీపీలో చేరిక, నాలుగేళ్ల క్రితమే Sat, Apr 27, 2024, 09:22 PM
ఏపీ ఎన్నికల్లో ఆ సీటు కోసం అంతపోటీనా?.. యాభైమందికి పైగా పోటీ Sat, Apr 27, 2024, 09:21 PM
ఏపీలో కీలక నేత నామినేషన్ తిరస్కరణ.. ఆ చిన్న కారణంతోనే Sat, Apr 27, 2024, 09:09 PM
ఉండవల్లి శ్రీదేవికి గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. ఎంపీ టికెట్ దక్కని మహిళనేతకు సైతం Sat, Apr 27, 2024, 09:04 PM