కరోనా సెకండ్‌ వేవ్.. వారిపైనే తీవ్ర ప్రభావం

by సూర్య | Tue, Mar 30, 2021, 03:03 PM

కరోనా సెకండ్‌ వేవ్‌ యువకులు, మధ్య వయస్కులపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు బెంగళూరు వైద్యులు గుర్తించారు. సెకండ్ వేవ్ ప్రభావం వృద్ధులపై కనిపించడం లేదని వారు పేర్కొన్నారు. కరోనా కేసులు పెరిగిన నాటి నుంచి బెంగళూరులో 20-39 మధ్య వయస్సున వ్యక్తులే ఎక్కువగా కరోనా బారిన పడుతున్నట్లు వారు నిర్ధారించారు. వైరస్‌ ట్రాన్‌మిసిబిలిటీ పెరగడం, ప్రజల ప్రవర్తనే ఈ పరిస్థితికి దారి తీసిందని వైద్యులు తెలిపారు.


దీనిపై ఆస్టర్‌ సీఎంఏ హాస్పిటల్‌ వైద్యుడు డాక్టర్‌ బ్రూన్డా మాట్లాడుతూ.. 35 నుంచి 40 ఏళ్ల వయసున్న చాలా మంది కరోనా బారిన పడుతున్నారని అన్నారు. మొదటి వేవ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్ ప్రసార రేటు ఎక్కువని, వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో ప్రజల కదలిక ఎక్కువై.. వైరస్ వ్యాప్తి రేటు పెరిగిందని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకునే వారి వయసును 35 సంవత్సరాలకు తగ్గించడాన్ని కేంద్రం ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలన్నారు. కేసులు పెరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.


యశ్వంత్‌పూర్‌లోని కొలంబియా ఆసియా రెఫరల్ హాస్పిటల్‌ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ప్రదీప్ రంగప్ప మాట్లాడుతూ.. సెకండ్ వేవ్ లో మొదటి వేవ్‌లో చూసిన విధంగానే మరణాలు చూడాల్సి వస్తుందని, అలాంటి దశలోకి వెళ్లకుండా చూసుకోవాలన్నారు. ఐసీయూ పడకలు పెంచడం ప్రారంభించాలని, వ్యాక్సిన్ లు అందుబాటులో ఉంచాలన్నారు.

Latest News

 
సింహాచలం వెళ్లే భక్తులకు శుభవార్త.. తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా! Sat, Apr 27, 2024, 09:31 PM
వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా.. సాయంత్రానికి టీడీపీలో చేరిక, నాలుగేళ్ల క్రితమే Sat, Apr 27, 2024, 09:22 PM
ఏపీ ఎన్నికల్లో ఆ సీటు కోసం అంతపోటీనా?.. యాభైమందికి పైగా పోటీ Sat, Apr 27, 2024, 09:21 PM
ఏపీలో కీలక నేత నామినేషన్ తిరస్కరణ.. ఆ చిన్న కారణంతోనే Sat, Apr 27, 2024, 09:09 PM
ఉండవల్లి శ్రీదేవికి గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. ఎంపీ టికెట్ దక్కని మహిళనేతకు సైతం Sat, Apr 27, 2024, 09:04 PM