కుంకుమ పువ్వుతో కలిగే ఆరోగ్య ప్ర‌యోజనాలివే..

by సూర్య | Tue, Mar 30, 2021, 03:02 PM

కుంకుమ పువ్వును గ‌ర్భ‌వ‌తులు పాల‌ల్లో కలిపి తీసుకుంటే పుట్ట‌బోయే పిల్ల‌లు ఎర్ర‌గా పుడ‌తారనే విషయం అంద‌రికీ తెలిసిందే. అయితే చాలా మంది గ‌ర్భిణులు మాత్ర‌మే కుంకుమ పువ్వు తినాల‌ని అనుకుంటుంటారు. కానీ కుంకుమ పువ్వు ఎవ‌రైనా తినొచ్చు. చాలా వాటికి కుంకుమ పువ్వు ఔష‌ధంగా ప‌నిచేస్తుంది. కుంకుమ పువ్వు వల్ల కలిగే ఆరోగ్య ప్ర‌యోజనాలేంటో ఒకసారి చూద్దాం.


- కుంకుమ పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అవి స‌హ‌జ‌సిద్ధంగా మ‌న చ‌ర్మం మెరిసేలా చేస్తాయి. చ‌ర్మంపై మొటిమ‌లు త‌గ్గించ‌డంలోనూ కుంకుమ పువ్వు దోహ‌దప‌డుతుంది.
- ఒత్తిడి, ఆందోళ‌న‌ను త‌గ్గించ‌డంలోనూ కుంకుమ పువ్వు ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇందులో పైటోకెమిక‌ల్స్‌, ఫెనోలిక్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి మెద‌డుకు అవ‌స‌ర‌మైన సెరోటోనిన్‌ను అందించ‌డంలో స‌హాయ‌ప‌డుతాయి.
- కుంకుమపువ్వు తీసుకోవ‌డం వ‌ల్ల అధిక ర‌క్త‌స్రావం వంటి స‌మ‌స్య ఉండ‌దు.
-అంగ‌స్తంభ‌న, వీర్య క‌ణాలు తక్కువ ఉన్న‌వారు రోజూ కుంకుమ పువ్వును తీసుకోవ‌డం వ‌ల్ల స‌త్ఫ‌లితాలు క‌నిపిస్తాయి.
- కుంక‌మ పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఫ్రీ రాడిక‌ల్స్ పెర‌గ‌కుండా ఉంటాయి. కాబ‌ట్టి కుంకుమ పువ్వును రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ బారిన ప‌డే అవ‌కాశం త‌గ్గుతుంద‌ని ప‌లు అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది.
- జీవక్రియ‌ను నియంత్రించ‌డంలోనూ కీల‌క పాత్ర పోషిస్తుంది. రోజూ కుంకుమ పువ్వును తీసుకోవ‌డం వ‌ల్ల ఆక‌లి అవ్వ‌దు. కాబ‌ట్టి త‌క్కువ ఆహారం తీసుకుంటారు. దీనివల్ల బ‌రువు త‌గ్గుతారు.
- ప‌డుకునే ముందు పాల‌ల్లో కుంకుమ పువ్వు క‌లుపుకుని తాగితే మంచి నిద్ర ప‌డుతుంది. దీంతో నిద్ర‌లేమి స‌మ‌స్య దూరం అవుతుంది.
- కుంకుమ పువ్వులో క్రోసిన్ అనే ప‌దార్థం ఉంటుంది. ఇది జ్వ‌రాన్ని త‌గ్గించ‌డంతో పాటు జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచ‌డంలో దోహ‌ద‌ప‌డుతుంది.
- కుంకుమ పువ్వులో క్రోసిటిన్ ఎక్కువ‌గా ఉంటుంది. అలాగే యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ గుణాలు ఉంటాయి. ఇవి ర‌క్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గిస్తాయి. ఫ‌లితంగా హృద్రోగాలు వ‌చ్చే అవ‌కాశం కూడా త‌గ్గుతుంది.
- కీళ్ల నొప్పులు, ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలోనూ కుంకుమ పువ్వు స‌హాయ‌ప‌డుతుంది.
- ఆస్త‌మా, కోరింత ద‌గ్గు ఇలా ప‌లు స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలోనూ ఉప‌యోగ‌ప‌డుతుంది.


క‌ల్తీని గుర్తించండిలా..


-> చిటికెడు కుంకుమ పువ్వును గోరువెచ్చ‌ని నీళ్లు లేదా గోరువెచ్చ‌టి పాలల్లో వేయాలి. త‌క్ష‌ణ‌మే రంగు మారితే అది అస‌లైనది కాదు. ఎందుకంటే అస‌లైన కుంకుమపువ్వు మిశ్రమం ఎరుపు నుంచి బంగారు రంగుకు రావ‌డానికి క‌నీసం 15 నిమిషాల స‌మ‌యం ప‌డుతుంది.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM