అమర్‌నాథ్ యాత్రకు ఏప్రిల్ 1 నుంచి రిజిస్ట్రేషన్లు

by సూర్య | Sun, Mar 28, 2021, 11:07 AM

 హిమాలయాల్లోని అమర్‌నాథ్ యాత్రకు సన్నాహాలు జరుగుతున్నాయి. భక్తులు ఏప్రిల్ 1 నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. జూన్ 28 నుంచి ఆగస్టు 22 వరకు భక్తులు అమరనాథుని దర్శించుకోవచ్చు. యాత్రలో పాల్గొనేవారంతా తప్పనిసరిగా కోవిడ్-19 మార్గదర్శకాలను పాటించాలి.శ్రీ అమర్‌నాథ్‌జీ ష్రైన్ బోర్డు (ఎస్ఏఎస్‌బీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నితీశ్వర్ కుమార్ మాట్లాడుతూ, అమర్‌నాథ్ యాత్రకు పహల్‌గామ్, బల్తల్ మార్గాల్లో వెళ్ళవచ్చునని చెప్పారు. ఈ రెండు మార్గాల్లోనూ జూన్ 28 నుంచి ఆగస్టు 22 వరకు ప్రయాణించవచ్చునని తెలిపారు. రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతాయన్నారు. భక్తులు https://www.shriamarnathjishrine.com వెబ్‌సైట్‌ను సందర్శించి రిజిస్ట్రేషన్, దరఖాస్తు నమూనా, రాష్ట్రాలవారీగా బ్యాంక్ శాఖల వివరాలు, పూర్తి చిరునామాలను తెలుసుకోవచ్చునని పేర్కొన్నారు.


దేశవ్యాప్తంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (316 శాఖలు), జమ్మూ-కశ్మీరు బ్యాంక్ (90 శాఖలు), యెస్ బ్యాంక్ (40 శాఖలు) ద్వారా ఏప్రిల్ 1 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయన్నారు. రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన లాంఛనాలను ముందుగానే పూర్తి చేసుకోవాలని, అసౌకర్యానికి గురి కాకుండా ఉండాలంటే ముందుగా అనుమతి పొందడం తప్పనిసరి అని తెలిపారు.


రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వం ద్వారా అధికారం పొందిన వైద్యులు లేదా మెడికల్ ఇన్‌స్టిట్యూట్స్ భక్తులకు జారీ చేసిన హెల్త్ సర్టిఫికేట్లను మాత్రమే రిజిస్టర్డ్ బ్యాంక్ బ్రాంచ్‌లలో అనుమతిస్తారని తెలిపారు. అమరనాథుని దేవాలయం అత్యంత ఎత్తులో ఉన్నందువల్ల, అక్కడికి చేరుకోవడానికి ప్రయాణం చాలా కష్టంతో కూడుకున్నది కావడం వల్ల హెల్త్ సర్టిఫికేట్లు తప్పనిసరి అని తెలిపారు.2021 మార్చి 15 తర్వాత జారీ చేసిన హెల్త్ సర్టిఫికేట్లను మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. యాత్రకు హెలికాప్టర్లలో వచ్చే భక్తులు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవలసిన అవసరం లేదన్నారు. హెలికాప్టర్ ప్రయాణ టిక్కెట్లను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.


భక్తులు బేస్ క్యాంపులకు ఎలా చేరుకోవాలి? రిజిస్ట్రేషన్ రుసుము, గుర్రాలు, పల్లకీలు, కూలీల ఛార్జీలు వంటి వివరాలను http://www.shriamarnathjishrine.com వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చునని తెలిపారు. వయసు పదమూడేళ్ళ లోపు బాలలు, 75 ఏళ్ళు పైబడినవారు, గర్భందాల్చి ఆరు వారాలు గడిచినవారు కోవిడ్-19 నిబంధనల దృష్ట్యా ఈ ఏడాది ఈ యాత్రకు రిజిస్ట్రేషన్ చేయించుకోరాదని తెలిపారు.భక్తులు యాత్రలో పాల్గొనేందుకు అనుమతిస్తూ జారీ చేసి పర్మిట్లు వేర్వేరు రంగుల్లో ఉంటాయన్నారు. వారంలో రోజునుబట్టి, ప్రయాణ మార్గాన్నిబట్టి పర్మిట్ రంగు ఉంటుందని వివరించారు.

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM