అరుదైన రికార్డుకు చేరువలో శిఖర్‌ ధావన్‌

by సూర్య | Sun, Mar 28, 2021, 11:04 AM

 ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో తృటిలో సెంచరీని చేజార్చుకున్న టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ రెండో వన్డేలో మాత్రం కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేశాడు. అయితే ఈరోజు భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య జరగనున్న మూడో వన్డేలో ఓ అరుదైన రికార్డు ధావన్‌ను ఊరిస్తోంది. మూడో వన్డేలో మరో 90 పరుగులు సాధిస్తే.. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 6 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న మూడో క్రికెటర్‌గా రికార్డుకెక్కనున్నాడు. ఈ జాబితాలో సౌతాఫ్రికా మాజీ ఓపెనర్‌ హషీమ్‌ ఆమ్లా టాప్‌ప్లేస్‌లో ఉండగా, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సెకండ్‌ ప్లేస్‌లో ఉన్నాడు. ఇక న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ మూడో స్థానంలో ఉన్నారు. గబ్బర్‌ ప్రస్తుతం 138 ఇన్నింగ్స్‌ల్లో 45.4 సగటుతో 5,910 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 31 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇవాళ జరుగబోయే మూడో వన్డేలో ధావన్‌ మరో 90 పరుగులు చేస్తే, కేన్‌ విలియమ్సన్‌ను వెనక్కు నెట్టి మూడో స్థానానికి చేరుకుంటాడు. వన్డేల్లో 6 వేల పరుగులు మార్కును చేరుకుంటే.. ఆ ఘనత సాధించిన 10వ భారత క్రికెటర్‌గా రికార్డు సాధించనున్నాడు.

Latest News

 
ప్రభాస్ మద్దతు ఆ పార్టీకే.. ప్రచారం కూడా చేస్తున్న కృష్ణంరాజు సతీమణి Wed, May 08, 2024, 10:16 PM
ఒంటరిగా కారులో మహిళ.. 5 నిమిషాల్లోనే పని ముగించిన ఇద్దరు దుండగులు Wed, May 08, 2024, 09:05 PM
ఏపీలో మరికొందరు పోలీసులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Wed, May 08, 2024, 09:00 PM
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆసక్తికర సన్నివేశం,,,పోస్టల్ బ్యాలట్ ఓటర్ల కాళ్లపై పడ్డ వైసీపీ నేతలు Wed, May 08, 2024, 08:56 PM
గద్దె రామ్మోహన్‌రావుపై సంచలన ఆరోపణలు..ఎన్నికలకు ముందు కుట్ర Wed, May 08, 2024, 08:52 PM