దేశంలో కొత్తగా 62 వేల కరోనా కేసులు

by సూర్య | Sun, Mar 28, 2021, 10:11 AM

 దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. దీంతో రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. నిన్న 62 వేల మంది కరోనా బారినపడగా, గత 24 గంటల్లో మరో 62,714 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,19,71,624కు చేరింది. ఇందులో 1,13,23762 మంది బాధితులు వైరస్‌ బారినుంచి బయటపడ్డారు. మరో 1,61,552 మంది మృతిచెందారు.


కరోనా బాధితులతోపాటు యాక్టివ్‌ కేసుల సంఖ్యకూడా క్రమంగా పెరుగుతున్నది. ప్రస్తుతం 4,86,310 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 312 మంది కరోనా బాధితులు మరణించారు. కొత్తగా 28,739 మంది డిశ్చార్జీ అయ్యారు. కాగా, దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నది. నిన్నటివరకు 6,02,69,782 మంది కరోనా టీకా వేయించుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.ప్రణాంతక వైరస్‌ మళ్లీ పంజా విసురుతుండటంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. విస్తృతంగా నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నాయి. ఇందులో భాగంగా దేశంలో నిన్న ఒక్కరోజే 11,81,289 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) ప్రకటించింది. దీంతో మార్చి 27 వరకు మొత్తం 24,09,50,842 నమూనాలను పరీక్షించామని వెల్లడించింది.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM