విశాఖ రాంబిల్లి పోలీసుల మానవత్వం

by సూర్య | Sun, Mar 28, 2021, 11:34 AM

కుళ్లి పోయి దుర్వాసన వస్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని మూడు కిలోమీటర్ల దూరం మోసి విశాఖ జిల్లా రాంబిల్లి పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. సీతపాలెం తీరానికి శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకొచి్చంది. ఎస్‌ఐ అరుణ్‌కిరణ్‌ కేసు నమోదు చేసి పలు పోలీస్‌ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. అయితే శనివారం దాకా మృతదేహం కోసం ఎవరూ రాలేదు. అప్పటికే మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది.


మృతదేహం తరలింపునకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎస్‌ఐ వి.అరుణ్‌కిరణ్‌ స్పందించారు. ఏఎస్‌ఐ దొర, హెచ్‌సీ మసేను, కానిస్టేబుల్‌ నర్సింగరావు, హోంగార్డు కొండబాబు కర్రల సాయంతో తీరం నుంచి మృతదేహాన్ని సీతపాలేనికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి వాహనంలో యలమంచిలిలోని మార్చురీకి తరలించారు. పోలీసులు చూపిన మానవత్వాన్ని ప్రజలు అభినందిస్తున్నారు


 


 

Latest News

 
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM
గిట్టుబాటు ధర లభించేలా పనులు చేయాలి Thu, Mar 28, 2024, 04:03 PM