జీశాట్‌-1 లాంఛ్‌ షెడ్యూల్‌ను సవరించిన ఇస్రో

by సూర్య | Sat, Mar 27, 2021, 09:17 AM

శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) జియో ఇమేజింగ్‌ ఉపగ్రహం జీశాట్‌-1 ప్రయోగ షెడ్యూల్‌ను సవరించింది. మొదట ప్రయోగాన్ని ఈ నెల 28న చేపట్టాలని భావించింది. చిన్న సాంకేతిక సమస్య తలెత్తడంతో వచ్చే నెల 18న ప్రయోగం చేపట్టాలని యోచిస్తున్నట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి. జీశాట్‌ ఉపగ్రహాన్ని మొదట గతేడాది మార్చి 5న శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించాలని అనుకున్నప్పటికీ సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. ఆ తర్వాత కరోనా ప్రేరేపిత లాక్‌డౌన్‌తో ఆలస్యమైంది. 2,268కిలోల బరువున్న జీశాట్-1 తొలి అత్యాధునికమైన భూ పరిశీలన ఉపగ్రహం. జీఎస్ఎల్వీ-ఎఫ్10 రాకెట్‌ ద్వారా శాటిలైట్‌ను జియోసింక్రనస్ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత ఈ ఉపగ్రహం తన ఆన్ బోర్డ్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను ఉపయోగించి ‘తుది భూస్థిర కక్ష్యను చేరుకుంటుంది’ అని ఇస్రో ఇంతకు ముందు తెలిపింది.

Latest News

 
ఏపీ రెయిన్ అలెర్ట్ Thu, May 09, 2024, 11:43 PM
రేపు ఐదు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నా చంద్రబాబు Thu, May 09, 2024, 10:15 PM
ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఎట్టిపరిస్థితుల్లోనూ కొనసాగించాల్సిందే : సీఎం జగన్ Thu, May 09, 2024, 09:45 PM
రూ.8.39 కోట్ల నగదు సీజ్ Thu, May 09, 2024, 06:20 PM
రోడ్ షో నిర్వహించిన టిడిపి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు Thu, May 09, 2024, 06:16 PM