బెంగాల్, అసోంలో ప్రారంభమైన పోలింగ్

by సూర్య | Sat, Mar 27, 2021, 08:56 AM

పశ్చిమబెంగాల్‌, అసోంలో ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్‌లో 30 స్థానాలకు, అసోంలో 47 స్థానాలకు తొలి దశలో ఎన్నికలు జరుగుతుండగా.. ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు చేసింది. బెంగాల్‌లో తొలిదశ పోలింగ్‌ కోసం 7,061 పోలింగ్‌ స్టేషన్లు, 10,288 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశారు. 73,80,942 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. అసోంలో 1,917 పోలింగ్‌ కేంద్రాల్లో 11,537 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. కరోనా మహమ్మారి వేళ అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. థర్మల్‌ స్కానర్లు, హ్యాండ్‌ శానిటైజర్లు, సబ్బులు.. సిబ్బందికి మాస్క్‌లు, ఇతర సామగ్రిని అందుబాటులో ఉంచినట్లు చెప్పింది. ఉదయం నుంచే ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. పోలింగ్‌ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాగనుంది. కరోనా మహమ్మారి వేళ గంట సమయం పొడగించారు.

Latest News

 
సింహాచలం వెళ్లే భక్తులకు శుభవార్త.. తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా! Sat, Apr 27, 2024, 09:31 PM
వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా.. సాయంత్రానికి టీడీపీలో చేరిక, నాలుగేళ్ల క్రితమే Sat, Apr 27, 2024, 09:22 PM
ఏపీ ఎన్నికల్లో ఆ సీటు కోసం అంతపోటీనా?.. యాభైమందికి పైగా పోటీ Sat, Apr 27, 2024, 09:21 PM
ఏపీలో కీలక నేత నామినేషన్ తిరస్కరణ.. ఆ చిన్న కారణంతోనే Sat, Apr 27, 2024, 09:09 PM
ఉండవల్లి శ్రీదేవికి గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. ఎంపీ టికెట్ దక్కని మహిళనేతకు సైతం Sat, Apr 27, 2024, 09:04 PM