పుణెలో భారీ అగ్నిప్రమాదం..

by సూర్య | Sat, Mar 27, 2021, 08:54 AM

మహారాష్ట్రలోని పుణెలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పుణెలోని ఫ్యాషన్‌ స్ట్రీట్‌ మార్కెట్‌లో నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత మంటలు అంటుకున్నాయి. దీంతో మార్కెట్‌ మొత్తం అగ్నికి ఆహుతయ్యింది. మంటలు పక్కనే ఉన్న షాపులకు వ్యాపించడంతో సుమారు 448 దుకాణాలు బుగ్గిపాలయ్యాయి.


పుణెలోని ఎంజీ రోడ్‌లో ఫ్యాషన్‌ స్ట్రీట్‌ ఉన్నది. అక్కడ ఉన్న చిన్నచిన్న దుకాణాల్లో బట్టలు, షూస్‌, గాగుల్స్‌, ఇతర యాక్సెసరీల అమ్మకాలు జరుగుతాయి. రాత్రి 9.30 గంటల సమయంలో అగ్నిప్రమాదానికి సంబంధించిన సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నామని చీఫ్‌ ఫైర్‌ఫైంటింగ్‌ ఆఫీసర్‌ ప్రశాంత్‌ రాన్‌పైస్‌ వెల్లడించారు. తక్కువ సమయంలోనే పక్కనే ఉన్న షాపులకు మంటలు వ్యాపించాయి. దీంతో 16 ఫైర్‌ఇంజన్లతో రాత్రి 1 గంటల వరకు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.


గత 15 రోజుల్లో పుణెలో ఇది రెండో అగ్నిప్రమాదం. మార్చి 16న పట్టణంలోని శివాజీ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇందులో సుమారు 25 దుకాణాలు దగ్ధమయ్యాయి.

Latest News

 
ఆలయంలో దొంగల బీభత్సం Fri, Mar 29, 2024, 08:22 PM
ఏపీలో రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మరికొన్ని రైళ్లు పొడిగింపు, పూర్తి వివరాలివే Fri, Mar 29, 2024, 08:11 PM
ఎవరితో ఎవరు.. ఏపీ ఎన్నికల్లో తలపడే అభ్యర్థుల పూర్తి జాబితా Fri, Mar 29, 2024, 08:08 PM
చిన్నాన్న అంటే అర్థం తెలుసా.. నీ పేరు బయటకొస్తుందని భయపడ్డావా: వైఎస్ సునీత Fri, Mar 29, 2024, 08:06 PM
విశాఖ తీరంలో అరుదైన చేప.. చూడటానికి అచ్చం మనిషిలాగే Fri, Mar 29, 2024, 08:05 PM