ఏడు బ్యాంకుల కస్టమర్లకు ​అలర్ట్

by సూర్య | Thu, Mar 25, 2021, 05:24 PM

ఏప్రిల్ 1 నుండి, 2021–22 ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. తద్వారా వివిధ ఆర్థిక లావాదేవీలతో పాటు బ్యాంకు లావాదేవీలు కూడా మారిపోనున్నాయి. ఈ మార్పులు ఆయా కస్టమర్లను ప్రభావితం చేయబోతున్నాయి. కాగా, నష్టాల్లో ఉన్న కొన్ని బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం ఇతర ప్రభుత్వ బ్యాంకుల్లో విలీనం చేసిన విషయం తెలిసిందే. అలా విలీనం చేసిన బ్యాంకుల్లో దేనాబ్యాంక్​, విజయా బ్యాంక్​, కార్పొరేషన్​ బ్యాంక్​, ఆంధ్రా బ్యాంక్​, ఓరియంటల్​ బ్యాంక్​ ఆఫ్​ కామర్స్​, యునైటెడ్​ బ్యాంక్​, అలహాబాద్​ బ్యాంక్​లు ఉన్నాయి. 2019 ఏప్రిల్​ 1 నుంచి ప్రారంభమైన ఈ బ్యాంకుల విలీన ప్రక్రియ 2020 ఏప్రిల్​ 1 వరకు కొనసాగింది. ఈ బ్యాంకుల విలీనం పూర్తయినప్పటికీ, వాటి పాస్​బుక్​లు, చెక్​బుక్​లు మాత్రం చెల్లుబాటవుతూ వచ్చాయి. అయితే, ఏప్రిల్​ 1 నుంచి ఈ బ్యాంకుల చెక్​బుక్​లు, పాస్​బుక్​లు చెల్లుబాటు కావు. ఈ ఏడు బ్యాంకుల చెక్ బుక్​ నిలిపివేయడం అనేది ఆయా బ్యాంక్ వినియోగదారుల బ్యాంకింగ్ అవసరాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపనుంది. కాబట్టి, ఈ ఏడు ప్రభుత్వ రంగ బ్యాంకులలో దేనిలోనైనా మీకు ఖాతా ఉన్నట్లైతే ఈ విషయాన్ని తప్పనిసరిగా గమనించాలి.

Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM