విశాఖకు కొత్త హంగులు..!

by సూర్య | Thu, Mar 25, 2021, 05:33 PM

విశాఖ జిల్లాకు పర్యాటక కేంద్రంగా మంచి గుర్తింపు ఉంది. ఈ ప్రాంతాన్ని మరింత సుందరవనంగా తీర్చిదిద్దానికి హంగులు అద్దుతున్నారు. విశాఖపట్నం నుంచి భీమిలి వరకూ ఇప్పుడున్న బీచ్‌రోడ్డు విస్తరణ, అలాగే భీమిలి నుంచి భోగాపురం వరకూ బీచ్‌ రోడ్డు నిర్మాణంపై సమావేశంలో చర్చించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు సీఎంకు వివరించారు.


అయితే భూసేకరణతో కలుపుకుని భీమిలి నుంచి భోగాపురం వరకూ రోడ్డు నిర్మాణానికి దాదాపు 1,167 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా వేసినట్టు అధికారులు వెల్లడించారు. బీచ్‌ కారిడార్‌ ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సీఎం ఆదేశించారు. భీమిలీ -భోగాపురం రహదారి దేశంలో అందమైన రోడ్డుగా నిలిచిపోవాలని సీఎం అధికారులకు సూచించారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణంపైనా కూడా దృష్టిపెట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు


ఇక అవకాశమున్న చోట్ల కొత్త రోడ్లతో పాటు ఉన్న రహదారుల విస్తరణకు సిద్ధమవుతోంది విశాఖ మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ. వారం పదిరోజుల్లో పనులు మొదలవుతాయన్నారు వీఎంఆర్డీఏ కమిషనర్‌ కోటేశ్వరరావు. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ విస్తరణకు వీలుగా ఉడా స్థానంలో వీఎంఆర్డీఏని ఏర్పాటుచేసిన ప్రభుత్వం.. తాజాగా విశాఖ జిల్లాలోని మరో 13 మండలాలను మెట్రో రీజియన్‌లోకి చేర్చింది. ఏజెన్సీ మినహా మిగిలిన 431 గ్రామాలను వీఎంఆర్డీఏ పరిధిలోకి చేరుస్తూ ఉత్తర్వులు జారీచేసింది.


ఆం కొత్త గ్రామాల విలీనానికి తోడు.. విశాఖ మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు సీఎం వైఎస్‌ జగన్‌. స్టీల్‌ ప్లాంట్‌ మెయిన్‌ గేట్‌ నుంచి భోగాపురం వరకు 76 కిలోమీటర్ల నిడివి, 53 స్టేషన్లతో మెట్రో నిర్మించాలని సమీక్షా సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. సీఎం జగన్ సూచించిన 24 గంటల్లోనే వీఎంఆర్డీఏ రంగంలోకి దిగింది. విశాఖలో భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధికారయంత్రాంగం అభివృద్ధిపనులు చేపట్టబోతోంది.

Latest News

 
వేమిరెడ్డి చాలా రిచ్.. ఆస్తుల విలువ తెలిస్తే నోరెళ్లబెడతారు, అఫిడవిట్ వివరాలివే Fri, Apr 19, 2024, 07:54 PM
మర్రిచెట్టు తొర్రలో నోట్ల కట్టలు.. అక్కడికి ఎలా వచ్చాయో తెలిస్తే Fri, Apr 19, 2024, 07:50 PM
కేఏ పాల్ ఆస్తులు మరీ అంత తక్కువా.. కేసులు మాత్రం Fri, Apr 19, 2024, 07:46 PM
ఇష్టం లేకపోయినా అక్కడ పోటీ చేస్తున్నా.. కన్నీళ్లు పెట్టుకున్న టీడీపీ అభ్యర్థి Fri, Apr 19, 2024, 07:42 PM
ఆ నాలుగు చోట్లా అభ్యర్థుల్ని మార్చేస్తున్న టీడీపీ?.. ఆయనకు మాత్రం బంపరాఫర్! Fri, Apr 19, 2024, 07:38 PM