50 వేలు దాటిన కోవిడ్ కేసులు

by సూర్య | Thu, Mar 25, 2021, 02:14 PM

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 53,364 మందికి కొత్తగా కోవిడ్-19 నిర్దారణ అయ్యింది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క రోజులో నమోదయిన అత్యధిక కరోనా కేసులు ఇవే కాగా.. ఐదు నెలల తర్వాత దేశంలో 50వేలకుపైగా కేసులు బయటపడ్డాయి. చివరిసారిగా అక్టోబరు 23న 54,350 కేసులు నిర్ధారణ అయ్యాయి. దేశంలో తొలి దశలో అత్యధికంగా సెప్టెంబరు 17న 98 వేల పాజిటివ్ కేసులు బయటపడగా.. ఆ తర్వాత నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టాయి. మరోవైపు, కోవిడ్ మరణాలు కూడా పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజు 200కిపైగా మరణాలు చోటుచేసుకున్నాయి. దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 248 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 1,60,726కి చేరుకుంది. అక్టోబరు 23 నాటికి దేశంలో 6,86,792 యాక్టివ్ కేసులుండగా.. అప్పటి నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు వేగంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మార్చి 24కి దేశంలో యాక్టివ్ కేసులు దాదాపు నాలుగు లక్షలు (396,889) ఉన్నాయి.


మహారాష్ట్రలో బుధవారం రికార్డుస్థాయిలో 31,855 కొత్త కేసులు నిర్ధారణ కాగా.. 95 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారంతో (134) పోల్చితే ఈ సంఖ్య తక్కువే. ఆ రాష్ట్రంలో 2.5 లక్షల యాక్టివ్ కేసులు ఉండటం గమనార్హం. ముంబయిలోనూ పాజిటివ్ కేసులు పెరగడంతో మహమ్మారి నియంత్రణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. జుహూ బీచ్ సహా ప్రముఖ ప్రాంతాలను మూసివేసింది. నిత్యావసరాల దుకాణాలను కూడా సాయంత్రం 7.00 గంటల్లోపు మూసివేయాలని ఆదేశించింది. గుజరాత్‌లోనూ 1,790 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, గుజరాత్ సహా మొత్తం 19 రాష్ట్రాల్లో జనవరి తర్వాత భారీగా పెరుగుతున్నట్టు కేంద్రం తెలిపింది. బుధవారం కర్ణాటక (2,290)లో నవంబరు 11 తర్వాత అత్యధిక కేసులు నమోదయ్యాయి.

Latest News

 
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్ Fri, May 03, 2024, 10:47 PM
మద్దెలచెరువు సూరి హత్య కేసులో సంచలనం.. భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష Fri, May 03, 2024, 10:41 PM
ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Fri, May 03, 2024, 10:36 PM
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ Fri, May 03, 2024, 10:32 PM