రాష్ట్రంలో 2 లక్షలమంది రైతులకు ఉచితంగా బోర్లు: అనీల్‌కుమార్

by సూర్య | Thu, Mar 25, 2021, 11:48 AM

రాష్ట్ర ప్రభుత్వం వై. యస్. ఆర్. జలకళ పధకం క్రింద రాష్ట్రంలోని 2 లక్షలమంది రైతులకు ఉచితంగా బోరుబావులు త్రవ్వడమే కాకుండా ఉచితంగా బోర్లు అందించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి డా. పి. అనీల్‌కుమార్ పేర్కొన్నారు. స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం భూగర్భజల శాఖ స్వర్ణోత్సవాలు సందర్భంగా భూగర్భజల వ్యవస్థలు, సవాళ్లు, అవకాశాలు అంశం పై ఏర్పాటుచేసిన జాతీయ సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


ఈ సందర్భంగా మంత్రి అనీల్ కుఅనిల్ కుమార్ మాట్లాడుతూ.. భూగర్భజల, గణనశాఖ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగస్వామి కావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ప్రతీ నీటిచుక్కను ఒడిసిపట్టుకుని నీటి ప్రాధాన్యతను తెలియజేసేలాగా ఎంతో బాధ్యతగా భూగర్భజలశాఖ తన విధులను నిర్వహిస్తోందన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలలో సమర్ధవంతంగా పనిచేసే శాఖలలో భూగర్భజలశాఖకు ఎంతో ప్రాధాన్యత ఉన్నదన్నారు.


ముఖ్యమంత్రి వై. యస్. జగన్మోహన రెడ్డి చిన్నవయస్సులోనే తనకు ఎంతో ప్రాధాన్యతతో కూడిన జలవనరులశాఖా మంత్రిగా నియమించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అందువల్లనే ఈ స్వర్ణోత్సవాలలో పాల్గొనే అదృష్టం తనకు దక్కిందన్నారు. భావితరాలకు త్రాగు, సాగునీరు అందించేందుకు నీటిని పొదుపుగా వాడడంలో, భూగర్భజలాల వివరాలను తెలియజేయడంలో ఆంధ్రప్రదేశ్ భూగర్భజలశాఖ గత 50 సంవత్సరాలుగా ఎ న్నో విశిష్టమైన అడుగులు వేసిందన్నారు. ఈవేదిక పై నుండి గతంలో పదవివిరమణ చేసిన వారి నుండి ఇప్పుడు పనిచేస్తున్నవారందరికీ తన అభినందనలు తెలియజేస్తున్నానన్నారు.


భూగర్భజల వ్యవస్థలు, సవాళ్లు, అవకాశాలు పై స్వర్ణోత్సవాలు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యశాల భవిష్యత్తు తరాలకు దిక్సూచిగా నిలుస్తుందనడంలో సందేహం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూగర్భజలాల పరిరక్షణకు పూర్తిగా సహాయ సహకారం అందిస్తున్నదని, ప్రజలు కూడా తమవంతు బాధ్యతను నిర్వర్తించాలని మంత్రి కోరారు. సదస్సుద్వారా గత అనుభవాలు, భవిష్యత్తులో ఎదుర్కునేందుకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలను ఒక అధ్యయనంగా నిలుస్తుందని మంత్రి అనీల్ కుమార్ అన్నారు. గత 50 సంవత్సరాలుగా వేసిన అడుగులను పుస్తకరూపంలో తేవడాన్ని మంత్రి అభినందించారు.

Latest News

 
పోలీసుల సమక్షంలోనే కొట్టారు... మంత్రి జోగి రమేష్ Mon, May 13, 2024, 09:16 PM
రేపు వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్,,,,పవన్ కల్యాణ్ కు ఆహ్వానం Mon, May 13, 2024, 09:15 PM
గ్లాసు గుర్తుకు ఓటు వేయమంటే, ఫ్యాన్ గుర్తుకు వేశారు.. 'నా ఓటు నాకు కావాల్సిందే'.. ఓటరు గొడవ Mon, May 13, 2024, 08:59 PM
బౌన్సర్లతో వచ్చిన టీడీపీ అభ్యర్థి.. వైసీపీ అభ్యంతరం, హై టెన్షన్ Mon, May 13, 2024, 07:45 PM
కదం తొక్కిన ఏపీ ఓటర్లు.. రికార్డు స్థాయిలో పోలింగ్ Mon, May 13, 2024, 07:41 PM