ఈ కంపెనీ బైక్ లు కొనాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్

by సూర్య | Wed, Mar 24, 2021, 12:32 PM

బైక్ కొనాలని ఆలోచిస్తున్నారా? ఖచ్చితంగా కొనాలనుకునే వారు ఆలోచించకండి. ఎందుకంటే ఏప్రిల్ 1న తర్వాత పలు ద్విచక్ర వాహనాల ధరలు పెరగనున్నాయి. వచ్చె నెల నుంచి తమ కంపెనీలోని ఆయా మోడళ్లపై ధరలు పెంచతున్నట్లు ప్రముఖ దిచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ షాకింగ్ న్యూస్ చెప్పింది.


ముడి పదార్థాల ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. తాజా ప్రకటన ప్రకారం.. కంపెనీకి చెందిన ప్రతి ద్విచక్ర వాహనంపై కనీసం రూ. 2500 వరకు పెరిగే అవకాశం ఉంది. గత జనవరిలోనే దిచక్ర వాహనాలపై రూ. 1500 పెంచిన హీరో మోటర్ కార్ప్ తాజాగా మరో సారి ధరలు పెంచడం పట్ల వినియోగదారులు ఆలోచనల్లో పడ్డారు. ఇదే బాటలో ఇతర ఆటో మొబైల్ సంస్థలు నిర్ణయాలు తీసుకనేందుకు సిద్దం అయ్యారు.


మారుతి సుజుకి, నిస్సాన్ కూడా తమ వాహనాలపై ఏప్రిల్ 1 నుంచి ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఉత్పత్తి వ్యయం పెరగడంతో నష్టాన్ని పూడ్చుకోవడానికే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. కరోనా కష్ట కాలంలో వాహన ధరలు పెరగడం వినియోగదారులను మరింత టెన్షన్ పెట్టిస్తోంది.

Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM