మే 15 నుంచి వేసవి సెలవులు.. వారికి మాత్రమే!

by సూర్య | Wed, Mar 24, 2021, 12:22 PM

ఏపీలో 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు మే 15 నుంచి వేసవి సెలవులను ప్రకటించారు. ఏప్రిల్‌ 30వ తేదీ వరకు సిలబస్‌ పూర్తి, సమ్మేటివ్‌ అసెస్ మెంట్‌(ఎస్ఏ) కోసం ప్రిపరేషన్‌, మే 1వ తేదీ నుంచి 10 వ తేదీ వరకు సమ్మేటివ్‌ పరీక్షలు నిర్వహిస్తారు. మే 11 నుంచి 15 వరకు మార్కుల అప్‌ లోడింగ్‌, ప్రమోషన్‌ జాబితా తయారు చేస్తారు. మే 15 నుంచి వేసవి సెలవులిస్తారు.


పదో తరగతి విద్యార్థులకు ఏప్రిల్‌ 30వ తేదీ వరకు సిలబస్‌ పూర్తి చేయనున్నారు. మే 1 వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ప్రీ ఫైనల్‌ పరీక్షలకు ప్రిపరేషన్‌ ఉంటుంది. మే 17 నుంచి 24 వరకు ప్రీ ఫైనల్‌ ఎగ్జామ్స్ ఉంటాయి. మే 25 నుంచి జూన్‌ 6 వరకు ఫైనల్‌ పరీక్షలకు ప్రిపరేషన్‌ ఉంటుంది. జూన్‌ 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు పబ్లిక్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మేరకు ఎస్‌సీఈఆర్‌టీ షెడ్యూల్‌ విడుదల చేసింది. దీన్ని బట్టి పదో తరగతి విద్యార్థులకు, టీచర్లకు వేసవి సెలవులు లేనట్టు స్పష్టం అవుతుంది.

Latest News

 
చిలమత్తూరు ఎంపీపీ, మరో 35 మందిపై కేసు Fri, May 17, 2024, 02:45 PM
ఎం పి ఎల్ ట్రోఫీ ఆవిష్కరణ Fri, May 17, 2024, 02:31 PM
మళ్లీ అధికారంలోకి వస్తాం: సజ్జల Fri, May 17, 2024, 02:30 PM
కారు ఇంజిన్‌ వేడెక్కి దగ్ధం Fri, May 17, 2024, 02:25 PM
ధాన్యం కొనుగోళ్లు డబ్బులు చెల్లించాలి Fri, May 17, 2024, 02:24 PM