40 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు కరోనా

by సూర్య | Tue, Mar 23, 2021, 05:05 PM

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకూ బలపడుతోంది. రోజుకు 40వేలకు పైగానే కొత్త కరోనా కేసులు భారత్‌లో నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతుండగా, దక్షిణాది రాష్ట్రాలను కూడా కరోనా వైరస్ కలవరపెడుతోంది. తాజాగా.. చెన్నైలోని ఐటీ కారిడార్‌లో ఓ ఐటీ సంస్థలో వెలుగుచూసిన కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రాజీవ్ గాంధీ సలై ఐటీ కారిడార్‌లోని ఓ ఐటీ సంస్థలో ఇటీవల నాలుగు కరోనా కేసులు వెలుగుచూశాయి. అయితే.. తాజాగా అదే సంస్థలో 40 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం గమనార్హం. దీంతో.. సంస్థలో కార్యకలాపాలను తక్కువ మంది స్టాఫ్‌తో అయినా నిర్వహించాలని లేదా పూర్తిగా సంస్థను మూసివేయాలని చెన్నై కార్పొరేషన్ అధికారులు సదరు సంస్థకు ఆదేశాలు జారీ చేశారు.

Latest News

 
సింహాచలం వెళ్లే భక్తులకు శుభవార్త.. తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా! Sat, Apr 27, 2024, 09:31 PM
వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా.. సాయంత్రానికి టీడీపీలో చేరిక, నాలుగేళ్ల క్రితమే Sat, Apr 27, 2024, 09:22 PM
ఏపీ ఎన్నికల్లో ఆ సీటు కోసం అంతపోటీనా?.. యాభైమందికి పైగా పోటీ Sat, Apr 27, 2024, 09:21 PM
ఏపీలో కీలక నేత నామినేషన్ తిరస్కరణ.. ఆ చిన్న కారణంతోనే Sat, Apr 27, 2024, 09:09 PM
ఉండవల్లి శ్రీదేవికి గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. ఎంపీ టికెట్ దక్కని మహిళనేతకు సైతం Sat, Apr 27, 2024, 09:04 PM