దేశంలోనే అతి పెద్ద పోర్టు ఆదానీ పరం

by సూర్య | Tue, Mar 23, 2021, 04:55 PM

ఏపీలో అత్యంత కీలకమైన, రెండో అతిపెద్ద పోర్టు గంగవరం ఆదానీ పరమవుతోంది. భారత్ లోనే అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్‌గా తమ సంస్థను విస్తరించేదిశగా అడుగులు వేస్తున్న ఆదానీ గ్రూప్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని గంగవరం పోర్టులో మెజారిటీ వాటాలు తమ సొంతం కానున్నట్లు ఆదానీ గ్రూపు అధికారికంగా ప్రకటించింది. డీవీఎస్‌ రాజు, ఆయన కుటుంబానికి ఉన్న 58.1 శాతం వాటా కొనుగోలు కోసం 3 వేల 604 కోట్ల ఒప్పందం కుదిరనట్లు పేర్కొంది. ఈ పోర్టు కంపెనీలో 31.5 శాతం వాటాను 1,954 కోట్లకు వార్‌బర్గ్‌ పింకస్‌ అనే విదేశీ సంస్థకు అనుబంధంగా ఉన్న విండీ లేక్‌సైడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ లిమిటెడ్‌ నుంచి కొనుగోలు చేసేందుకు ఆదానీ గ్రూపు ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఈ పోర్టు కంపెనీలో ఆదానీ గ్రూపునకు చెందిన ఆదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజడ్‌ లిమిటెడ్‌ వాటా 89.6 శాతానికి చేరనుంది.

Latest News

 
రాష్ట్ర భవిష్యత్ గురించి ప్రతి ఒక్కరు ఆలోచించాలి Fri, Mar 29, 2024, 10:57 AM
సాంకేతిక లోపంతో నిలిచిపోయిన రైలు Fri, Mar 29, 2024, 10:56 AM
రేపటినుండి ప్రజల్లోకి వారాహి తో పవన్ Fri, Mar 29, 2024, 10:55 AM
చల్లా బాబుకు ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు Fri, Mar 29, 2024, 10:55 AM
జగన్‌పై కోర్టుల్లో ఒంటరిగా పోరాడుతున్నా Fri, Mar 29, 2024, 10:55 AM