నేడు రైతు సంఘాలతో కేంద్రం చర్చలు..

by సూర్య | Wed, Jan 20, 2021, 12:13 PM

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం బుధవారం పదో విడత చర్చలు జరుపనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ విజ్ఞాన్‌ భవనంలో ఈ చర్చలు జరుగనున్నాయి. ఇప్పటివరకు రైతు సంఘాలతో కేంద్రం తొమ్మిది సార్లు చర్చలు జరిపింది. ఇరుపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో చర్చలు కొలిక్కి రావడం లేదు. కొత్త వ్యవసాయ చట్టాలు వ్యవసాయ ప్రజాప్రయోజనాల కోసమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. మంచి చర్యలు తీసుకున్నప్పుడల్లా అడ్డంకులు వస్తాయని, రైతుల నాయకులు తమదైన రీతిలో పరిష్కారం కోరుకుంటున్నందున సమస్యను పరిష్కరించేందుకు ఎక్కువ సమయం తీసుకుంటుందని కేంద్రం పేర్కొంది.
చట్టాలను రద్దు చేయడం, పంటలకు కనీస మద్దతు ధర తప్ప మరో ప్రతిపాదనకు ఒప్పుకునేది లేదని రైతు సంఘాలు అంటున్నాయి. అయితే చట్టాల రద్దు మినహా దేనికైనా అంగీకారమేనని ప్రభుత్వం అంటోంది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు రెండు నెలలుగా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని, కనీస మద్దతు ధరపై చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్ తన మొదటి సమావేశాన్ని మంగళవారం నిర్వహించింది. వ్యవసాయ చట్టాలకు సభ్యులు అనుకూలంగా ఉన్నారని, సుప్రీం కోర్టు నియమించిన ప్యానెల్ ‌ను రైతులు ఇప్పటికే తిరస్కరించిన విషయం తెలిసిందే.

Latest News

 
చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పథకమైనా గుర్తుకు వస్తుందా? Fri, May 03, 2024, 04:04 PM
చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది Fri, May 03, 2024, 04:03 PM
చంద్ర‌బాబు కూటమిలో అన్ని సాధ్యం కాని హామీలే Fri, May 03, 2024, 04:03 PM
ఒక హామీ అప్పుడే మాయమైనది Fri, May 03, 2024, 04:02 PM
కార్మికులకు భధ్రత కల్పించింది వైసీపీ ప్రభుత్వమే Fri, May 03, 2024, 04:02 PM