గొల్లపూడిలో మళ్ళీ టెన్షన్..

by సూర్య | Wed, Jan 20, 2021, 12:17 PM

గొల్లపూడిలో మరోసారి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అమరావతి ఉద్యమం 400 రోజుల పూర్తి అయిన నేపథ్యంలో టీడీపీ దీక్షకు పిలుపు నిచ్చింది. ఈ క్రమంలో రాజధాని రైతులకు మద్దతుగా దేవినేని ఉమా దీక్షకు సిద్ధమయ్యారు అయితే దేవినేని ఉమా దీక్షకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. అలాగే గొల్లపూడి దీక్షా ప్రాంగణం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.తమ కార్యాలయ ప్రాంగణంలోని నిరసన చేస్తామని టీడీపీ చెబుతోంది. అయితే నిన్నటి ఉద్రిక్త కారణంగా పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ నేపధ్యంలో పోలీసుల వలయంలో గొల్లపూడి సెంటర్, దేవినేని ఉమ నివాసం ఉన్నాయి. సమీపంలోని నివాసాలు ఉండే వారు సైతం తీవ్ర ఇబ్బందులు గురవుతున్నట్టు చెబుతున్నారు. ఒకరకంగా గొల్లపూడిలో కర్ఫ్యూ వాతావరణం తలపిస్తోంది. పోలీసుల ఆంక్షలతో ఉమా నివాసంలోనే దీక్షకు దిగారు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM