డీజీపీ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గారు: విష్ణువర్ధన్ రెడ్డి

by సూర్య | Wed, Jan 20, 2021, 11:53 AM

డీజీపీ రాజకీయ ఒత్తిడులకు లొంగి వ్యాఖ్యలు చేస్తున్నారని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విగ్రహాల ధ్వంసంలో టీడీపీ, బీజేపీ కార్యకర్తల హస్తం ఉందని ఆరోపించడం కరెక్ట్ కాదన్నారు. డీజీపీ మాటలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని ఆయన తెలిపారు. ఏపీలో శాంతిభద్రతలు కాపాడటంలో పోలీసులు విఫలయ్యారని పేర్కొన్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయం పోలీసులకు హెడ్ క్వార్టర్స్‎గా మారిందని ఎద్దేవా చేశారు.మంత్రి వెల్లంపల్లి సీబీఐని విమర్శించే స్థాయికి వెళ్ళి పోయారని ఆయనను విమర్శించారు. ఏపీ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లిపోతుందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీ ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. కరకట్ట మీద భవనాలు కూల్చడం తప్ప జగన్‎కు ప్రణాళికలు లేవని ఆరోపించారు. ఏదీఏమైనా బీజేపీ రథయాత్రను ఎవరూ అడ్డుకోలేరని తెలిపారు. తిరుమలలో బీజేపీ యాత్రను అడ్డుకుంటే రాష్ట్రంలో వైసీపీ కనుమరుగు కావడం ఖాయమని జోత్స్యం చెప్పారు. కపిలతీర్థం నుండి రామతీర్థం వరకు యాత్ర చేసి తీరుతామని, పాస్టర్ ప్రవీణ్‎ను పోలీసులు ఎందుకు కస్టడిలోకి తీసుకోవడం లేదంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం వెనుక వైసీపీ ప్రభుత్వం కుట్రచేస్తోందని ఆరోపించారు. జనసేన, బీజేపీ సంయుక్తంగానే యాత్ర చేపడుతోందన్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM