హైకోర్టు తీర్పుతో ఆ కొత్త జంటకు మైండ్ బ్లాంక్

by సూర్య | Wed, Jan 20, 2021, 10:49 AM

సర్, మేము ఇద్దరం మేజర్లం. మా గతం గురించి ఎవరికీ అవసరం లేదు. ప్రస్తుతం మేము ఇద్దరం కలిసి ఉండాలనుకుంటున్నాం. సమాజంలో భార్యాభర్తలుగా జీవించాలనుకుంటున్నాం. మేజర్లమైన మాకు ఆ నిర్ణయం తీసుకునే హక్కు ఉంది. అందువల్ల మా బంధాన్ని విడదీసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే, దాన్నుంచి మాకు రక్షణ కావాలి. మాపై ఎవరూ కేసు పెట్టకుండా ఆదేశాలు జారీ చేయండి‘.. ఇదీ ఓ జంట అలహాబాద్ హైకోర్టులో ( Allahabad High Court) వేసుకున్న పిటిషన్. పైన చెప్పుకున్నది చదివితేనే కేసు గురించి ఇట్టే అర్థమయిపోతుంది. వాళ్ల పరిస్థితి ఏంటన్నది. అయితే ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు షాకింగ్ తీర్పునిచ్చింది. హైకోర్టు ఇచ్చిన దెబ్బకు పిటిషనర్ల మైండ్ బ్లాంక్ అయిపోయింది. వివరాల్లోకి వెళ్తే..


ఆషా దేవీ, సూరజ్ కుమార్ అనే జంట అలహాబాద్ హైకోర్టులో ఓ పటిషన్ ను దాఖలు చేసుకుంది. తాము ఇద్దరము కలిసి ఉండాలని నిర్ణయించుకున్నామనీ, తమపై ఎవరూ ఎటువంటి కేసులు పెట్టకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. మా బంధంలో మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా చూడాలని వేడుకుంది. వీరి ఆవేదనను విన్న అలహాబాద్  హైకోర్టు, వీరి బంధం గురించి ఈ కేసు విషయమై కీలక వ్యాఖ్యలు చేసింది. వీరి పిటిషన్ ను అడ్డంగా కొట్టేసింది.


 


 


‘పిటిషన్ ను దాఖలు చేసిన జంటలో, ఆశాదేవికి గతంలోనే పెళ్లయింది. మహేష్ చంద్ర అనే భర్త ఉన్నాడు. ఆమె అతడికి విడాకులు ఇవ్వలేదు. చట్టబద్దంగా భర్తకు విడాకులు ఇవ్వకుండానే సూరజ్ తో కలిసి ఉంటోంది. ఇది చట్టపరంగా న్యాయం ఎలా అవుతుంది. ఇలాంటి విషయాల్లో పిటిషనర్ రక్షణ కోరడానికి అర్హులు కాదు. హైకోర్టు నుంచి వారికి ఈ మేరకు ఎలాంటి రక్షణ లభించదు‘ అని అలహాబాద్ హైకోర్టు  (Allahabad High Court) న్యాయమూర్తులు ఎస్పీ కీసర్వాణీ, జస్టిస్ వైకే శ్రీవాత్సవ సోమవారం ఇచ్చిన తీర్పులో స్పష్టం చేశారు. ఆశాదేవీ ఇప్పటికీ చట్టపరంగా మహేశ్ చంద్రకు భార్యేనని వెల్లడించారు. పెళ్లయి ఒక బంధంలో ఉండగా, జీవిత భాగస్వామిని కాకుండా మరో పెళ్లి చేసుకోవడం చట్టపరంగా నేరమేననీ, సెక్షన్ 494 కింద ఆశాదేవి శిక్షార్హులారన్నారు. ఇప్పటికయినా ఆశాదేవి తన తప్పేంటో గ్రహించి భర్త వద్దకు వెళ్లడమో, లేక చట్టపరంగా అతడితో విడాకులు తీసుకోవడమో చేయాలని సూచించారు. ఆ జంట కోర్టులో వేసిన పిటిషన్ ను అలహాబాద్ హైకోర్టు కొట్టేసింది.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM