నేరం చేయకుండా 14 ఏళ్లు జైల్లో..

by సూర్య | Mon, Jan 18, 2021, 05:33 PM

ప్రస్తుత కాలంలో ఎన్నో నేరాలు చేసి న్యాయస్థానాన్ని తప్పుదొవ పట్టించి, నిందితులు శిక్షను తప్పించుకొని యథేచ్ఛగా బయట తిరుగుతుంటారు. కొన్ని సార్లు చెయ్యని తప్పుకు కూడా శిక్ష పడి జైలు జీవితం గడపాల్సి వస్తుంది. అలాంటి ఘటననే ఓ మాజీ ఆర్మీ ఉద్యోగికి ఎదురైంది. తాను తప్పు చేయకున్నా.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవించారు. అతడి శిక్ష పద్నాగేళ్లు పూర్తయి ఇంకా కేవలం 11 రోజుల ఉండగా నిర్ధోషి అని కోర్టు తేల్చింది. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో సంభవించింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే..మొరెనా జిల్లా భర్రద్‌కు చెందిన బల్వీర్‌సింగ్‌ యాదవ్‌ అనే మాజీ ఆర్మీ ఉద్యోగి 2006లో ఓ హత్య కేసులో కొందరు స్నేహితులతో పాటు అతనూ అరెస్ట్ అయ్యారు. కోర్టులో కేసుకు సంబంధించిన వాదోపవాదనలు జరిగాయి. ఆ తర్వాత బల్వీర్‌సింగ్‌ యాదవ్‌కు న్యాయస్థానం 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అప్పటి నుంచి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. శిక్షకాలం పూర్తి కావస్తున్న నేపథ్యంలో శుక్రవారం మధ్యప్రదేశ్‌హైకోర్టు మర్డర్‌ కేసులో బల్వీర్‌సింగ్‌ను నిర్దోషిగా తేల్చింది. విడుదలకు 11 రోజుల మందు ఈ తీర్పు రావటం గమనార్హం.
ఈ సందర్భంగా బల్వీర్ సింగ్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సురేంద్ర యాదవ్‌ ను చూసినందుకు తనని ఈ కేసులో నిందితుడిగా ఇరికించారని వాపోయాడు. మధ్యప్రదేశ్‌హైకోర్టు నన్ను ఈ కేసుకు సంబంధం లేదని నిర్ధోషిగా తేల్చినందుకు సంతోషంగా ఉంది. కానీ నేను నా ఉద్యోగం, గౌరవం, విలువైన 14 సంవత్సరాల కాలాన్ని పోగొట్టుకున్నాను. అయిన కూడా న్యాయవ్యవస్థపై నాకు నమ్మకం పెరిగింది. న్యాయవ్యవస్థ ఏదైనా తీర్పు ఇవ్వటానికి కచ్చితమైన గడువు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఎందుకనగా నేను ఎలాంటి తప్పు చేయకున్నా పద్నాగేళ్లు శిక్ష అనుభవించటం చాలా కష్టంగా ఉందని బల్వీర్ సింగ్ యాదవ్ వాపోయారు. ఈ తీర్పు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Latest News

 
మరో వారం రోజుల్లో పోలింగ్.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు Mon, May 06, 2024, 09:47 PM
హీరో సాయి ధరమ్‌తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత.. కాన్వాయ్‌పైకి రాయి, ఒకరికి తీవ్ర గాయాలు Mon, May 06, 2024, 09:02 PM
నగరిలో టీడీపీకి జైకొట్టిన వైసీపీ కీలక నేతలు.. మంత్రి రోజాపై ఆగ్రహం Mon, May 06, 2024, 08:58 PM
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల సంఘం శుభవార్త.. ఇక నో టెన్షన్ Mon, May 06, 2024, 08:54 PM
ఇదంతా ఆ ముగ్గురి కుట్ర, నాలుగేళ్లగా జరుగుతోంది.. అల్లుడు గౌతమ్ వ్యాఖ్యలపై మంత్రి రాంబాబు స్పందన Mon, May 06, 2024, 08:00 PM