మార్పు రాకుంటే పీడీ యాక్ట్ అమలు: ఎస్పీ

by సూర్య | Mon, Jan 18, 2021, 05:13 PM

మచిలీపట్నం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్, ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ వకుల్ జిందాల్ తో కలిసి జిల్లాలో ఉన్న 14 ఎస్ఈబీ పోలీస్ స్టేషన్ల అధికారులకు డిసెంబరు మాసం ఎక్సైజ్ కేసులకు సంబంధించి జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్ఈబీ ఎక్సైజ్ సూపరింటెండెంట్ లు, ఎక్సైజ్ సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కోవిడ్ కారణంగా పెండింగ్ చార్జిషీట్లు ఆన్లైన్లో నమోదు చేయాలని, తెలంగాణ లేదా ఇతర రాష్ట్రాల నుండి జిల్లాకు అక్రమ మద్యం తరలి రాకుండా నిఘా కట్టుదిట్టం చేయాలని, జిల్లాలో ఎక్కడా కూడా కాపుసారా లేకుండా నియంత్రించాలన్నారు. అక్రమ మద్యం తరలిస్తున్న వారిపై, బెల్టు షాపులు, నాటు సారా తయారు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని, ఎవరైతే అక్రమ మద్యం తరలిస్తూ ఎక్కువ కేసుల్లో పట్టుబడ్డారు వారిపై సస్పెక్ట్ షీట్లు తెరవాలని, ప్రవర్తనలో మార్పు రాకుంటే వారిపై పీడీ యాక్ట్ లు నమోదు చేయాలని తెలిపారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఐదుగురిపై పీడీ యాక్ట్ అమలు చేయడం జరిగిందని, జిల్లాలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఏర్పడిన తర్వాత ఇప్పటికి 79 సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేయడం జరిగిందన్నారు.

Latest News

 
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపింది నేనే Fri, Apr 26, 2024, 06:46 PM
ఆలోచించి ఓటు వెయ్యండి Fri, Apr 26, 2024, 06:46 PM
సీఎం జగన్ పై మండిపడ్డ వర్ల రామయ్య Fri, Apr 26, 2024, 06:45 PM
ఒకే పేరుతో పలు నామినేషన్లు Fri, Apr 26, 2024, 06:45 PM
రాష్ట్రానికి కూటమి ఎంతో అవసరం Fri, Apr 26, 2024, 06:44 PM