ఐదుగురికి ప్రాణం పోసిన 20 నెలల చిన్నారి!

by సూర్య | Mon, Jan 18, 2021, 05:11 PM

ఓ ప‌సిపాప పుట్టిన 20 నెల‌లకే ‌తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయింది. ఆ చిన్నారి వెళ్తూ వెళ్తూ మ‌రో ఐదుగురి ప్రాణాల‌ను కాపాడింది. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. ఆ చిన్నారి పేరు ధ‌నిష్తా. ఇప్పుడు ఆ చిట్టిత‌ల్లి.. దేశంలోనే అత్యంత పిన్న వ‌య‌సు అవ‌య‌వ దాత‌గా నిలిచింది. ఈ నెల 8న ధ‌నిష్తా బాల్క‌నీలో నుంచి కింద పడింది. దీంతో చిన్నారిని కుటుంబ సభ్యులు ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌గా.. ఈ నెల 11న ఆ పాప బ్రెయిన్ డెడ్ అయిన‌ట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆ చిన్నారి త‌ల్లిదండ్రులు ఆశిశ్ కుమార్‌, బ‌బితా.. చిన్నారి అవ‌య‌వాల‌ను దానం చేయాల‌ని నిర్ణ‌యించారు. పాప గుండె, కాలేయం, రెండు కిడ్నీలు, కార్నియాల‌ను ఐదుగురు పేషెంట్ల‌కు ఇచ్చారు. తాము ఆసుప‌త్రిలో ఉన్న స‌మ‌యంలో అవ‌య‌వాల కోసం చూస్తున్న ప‌లువురిని క‌లిశామ‌ని ఆశిశ్ కుమార్ చెప్పారు. మా పాప చ‌నిపోయినా.. ఆ ఐదుగురిలో జీవించే ఉంటుంద‌ని ఆయ‌న అన్నారు.

Latest News

 
టిడిపి అరాచకం మాదిగలపై దాడి Mon, May 06, 2024, 03:59 PM
అల్లి నగరంలో ఎన్నికల ప్రచారం Mon, May 06, 2024, 03:55 PM
పోస్టల్ బ్యాలెట్స్ కి అపూర్వ స్పందన Mon, May 06, 2024, 03:53 PM
పేదల సంక్షేమమే వైసీపీ ధ్యేయం: నాగార్జున Mon, May 06, 2024, 03:51 PM
భైరవకోనలో ప్రత్యేక పూజలు Mon, May 06, 2024, 03:49 PM