రైల్వే ఉద్యోగం చేయాలనుకునేవారికి అలర్ట్!

by సూర్య | Sun, Jan 17, 2021, 03:19 PM

ఆర్ఆర్‌బీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్-NTPC, మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ లాంటి నోటిఫికేషన్ల ద్వారా వేలాది పోస్టుల్ని రైల్వే శాఖ భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్‌టీపీసీ ఉద్యోగాలకు పరీక్షలు జరుగుతున్నాయి. అయితే కొంతకాలంగా రైల్వే ఉద్యోగాల పేరుతో మోసాలు పెరుగుతున్నాయి. ఇటీవల ఇలాంటి మోసాలు తమ దృష్టికి వచ్చాయని, రైల్వేలో ఉద్యోగాల పేరుతో అమాయకులను మోసం చేస్తున్నారని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. భారతీయ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్-RRC లేదా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB నిర్వహించే పరీక్షలు పాస్ అయిన వారికి మాత్రమే రైల్వేలో ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులను అప్రమత్తం చేస్తోంది. రైల్వేలో ఉద్యోగం కోరుకునేవారు రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్-RRC లేదా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB నోటిఫికేషన్లు జారీ చేసే నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసి, పరీక్ష రాసి, అందులో క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అంతే తప్ప బ్రోకర్లు, దళారుల మాటలు నమ్మకూడదు. రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తామంటే డబ్బులు ఇవ్వకూడదు. రైల్వే ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్-RRC లేదా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB, రైల్వే అధికారిక వెబ్‌సైట్‌లు మాత్రమే ఫాలో కావాలని దక్షిణ మధ్య రైల్వే హెచ్చరిస్తోంది.

Latest News

 
ఈ నెల 11న కడపలో పర్యటించనున్న రాహుల్ Wed, May 08, 2024, 08:28 PM
ఏబీ వెంకటేశ్వరరావుకి ఊరట Wed, May 08, 2024, 08:27 PM
వైసీపీ నేతలపై జబర్దస్త్ కిరాక్ ఆర్‌పి సంచలన కామెంట్స్ Wed, May 08, 2024, 08:26 PM
కూటమికి ప్రజల మద్దతు ఉంది Wed, May 08, 2024, 08:25 PM
నాకు న్యాయం చెయ్యండి Wed, May 08, 2024, 08:24 PM