గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,158 వైరస్‌ కేసులు

by సూర్య | Sat, Jan 16, 2021, 10:28 AM

దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,158 వైరస్‌ కేసులు బయటపడ్డాయి. క్రితం రోజుతో పోలిస్తే 432 కేసులు తక్కువ. శనివారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,05,42,841కి చేరింది. ఇక గత 24 గంటల్లో మరో 16,977 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు వైరస్‌ నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,01,79,715కి పెరిగింది. రికవరీ రేటు 96.56శాతంగా ఉంది.


ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,11,033 కరోనా క్రియాశీల కేసులుండగా.. క్రియాశీల రేటు 2శాతానికి తగ్గింది. మరోవైపు వైరస్‌ కారణంగా నిన్న మరో 175 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు మొత్తంగా 1,52,093 మంది కరోనాకు బలయ్యారు. శుక్రవారం 8,03,090 కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 18,57,65,491 మందికి టెస్టులు చేశారు.


 


పూలతో అలంకరణ.. హారతితో స్వాగతం


 


మరోవైపు కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా టీకా పంపిణీ బృహత్తర కార్యక్రమం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా 3006 కేంద్రాల్లో నేటి నుంచి టీకా పంపిణీ మొదలవుతుంది. తొలి రోజు 3లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు టీకా ఇవ్వనున్నారు.


 


టీకా పంపిణీ ప్రారంభం కోసం ఇప్పటికే ఆయా కేంద్రాలు సిద్ధమయ్యాయి. వ్యాక్సినేషన్‌ కేంద్రాలను పూలు, బెలూన్లతో అలంకరించారు. కొన్ని చోట్ల టీకా తీసుకునే లబ్ధిదారులను స్వాగతించేందుకు సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హారతి పళ్లెంతో వారికి స్వాగతం పలకనున్నారు.

Latest News

 
ఓవైపు కూతురు.. మరోవైపు కొడుకు పోటీ.. మధ్యలో వైసీపీ లీడర్ Mon, Apr 29, 2024, 07:44 PM
వైసీపీలోకి పిఠాపురం వర్మ?.. క్లారిటీ వచ్చేసిందిగా Mon, Apr 29, 2024, 07:39 PM
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: భూ వివాదాలు లేకుండా చేస్తారా..? అసలు భూమే లేకుండా చేస్తారా Mon, Apr 29, 2024, 07:35 PM
నామినేషన్ ఉపసంహరణ గడువు పూర్తి.. ఆ స్థానాల్లో టీడీపీకి తప్పని తలనొప్పి Mon, Apr 29, 2024, 07:31 PM
ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమికి షాక్.. జనసేన గుర్తుతో కొత్త తలనొప్పి Mon, Apr 29, 2024, 07:27 PM