హార్ధిక్ పాండ్యా తండ్రి క‌న్నుమూత‌..

by సూర్య | Sat, Jan 16, 2021, 10:26 AM

 టీమిండియా క్రికెట‌ర్ హార్ధిక్ పాండ్యా తండ్రి హిమాన్షు పాండ్యా ఇవాళ ఉద‌యం తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో ఆయ‌న మ‌ర‌ణించిన‌ట్లు కుటుంబ‌స‌భ్యులు చెప్పారు.  హార్ధిక్ పాండ్యా సోద‌రుడు కృణాల్ పాండ్యా ప్ర‌స్తుతం స‌య్య‌ద్ ముస్తాక్ అలీ టోర్నీలో బ‌రోడా కెప్టెన్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నాడు. అయితే తండ్రి మ‌ర‌ణ‌వార్త తెలిసిన కృణాల్ టోర్నీ నుంచి నిష్క్ర‌మించాడు. ఈ విష‌యాన్ని జ‌ట్టు యాజ‌మాన్యం పేర్కొన్న‌ది. కృణాల్ నేతృత్వంలోని బ‌రోడా జ‌ట్టు.. ఇప్ప‌టివ‌ర‌కు ముస్తాక్ అలీ టోర్నీలో మూడు మ్యాచ్‌ల‌ను గెలిచింది.  ఆల్‌రౌండ‌ర్ హార్ధిక్ పాండ్యా ప్ర‌స్తుతం ఇంగ్లండ్‌తో జ‌రిగే సిరీస్ కోసం ప్రాక్టీసు చేస్తున్నాడు.  ముస్తాక్ అలీ టోర్నీలో హార్ధిక్ ఆడ‌డం లేదు. 

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM