రెస్టారెంట్‌ కు చుక్కలు చూపించాడు!

by సూర్య | Fri, Jan 15, 2021, 05:36 PM

రెస్టారెంట్లు, మల్టీప్లెక్స్‌లో ఎమ్మార్పీ కంటే అధిక మొత్తాన్ని వసూలు చేస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. ఇదేంటని వినియోగదారులు నిలదీస్తే మీకు దిక్కున్నచోట చెప్పుకోండి అంటూ సమాధానం ఇస్తున్నారు. దీంతో చేసేది ఏమీలేక చెప్పినంత వేసినంత బిల్లు కట్టి మౌనంగా వెళ్లిపోతుంటారు. అయితే, ఓ వ్య‌క్తి మాత్రం ఈ విషయాన్ని వదలిపెట్టకుండా.. ఒకటి రెండు కాదు ఏకంగా ఐదేళ్లు సుదీర్ఘ పోరాటం చేసి విజయం సాధించాడు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన రోహిత్‌ పాటిల్ (67) అక్టోబరు 2015లో ఎస్‌జీ జాతీయ రహదారిపై ఓ హోటల్‌కు వెళ్లి త‌న స్నేహితుల‌తో క‌లిసి భోజ‌నం చేశాడు. అలాగే, ఓ వాటర్‌ బాటిల్ కొనుకున్నాడు. అయితే, నీళ్ల సీసాకు వేసిన బిల్లు చూసి అవాక్కయ్యాడు. రూ.20 వాట‌ర్ బాటిల్ కి బిల్లులో రూ.164 ఛార్జ్ చేయడంతో రెస్టారెంట్ సిబ్బందిని నిలదీశాడు. తాము వాటర్‌ బాటిల్‌ను ఆ ధరకే అమ్ముతామ‌ని చెప్పి రోహిత్ వద్ద ఆ మొత్తాన్ని వసూలు చేశారు. ఎమ్మార్పీ కంటే ఎనిమిది రెట్లు వసూలు చేయడంతో దీనిని వినియోగదారుల ఫోరమ్‌లో ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నాడు. బిల్లు చెల్లించి, బాటిల్‌ను కూడా తన వెంట తెచ్చుకున్నాడు.
బిల్లు ఆధారంగా నవంబరు 2015లో వినియోగదారుల ఫోరమ్‌లో ఫిర్యాదు చేయడంతో, పరిహారంగా తనకు రూ.లక్ష ఇప్పించాలని కోరాడు. అతడి ఫిర్యాదును విచార‌ణకు స్వీకరించిన కోర్టు రెస్టారెంట్ యాజమాన్యానికి నోటీసులు పంపింది. దీంతో తమ తరపున లాయర్‌ను నియమించుకుని వాదనలు వినిపించింది. వాటర్‌ బాటిల్‌కు రూ.164 బిల్లు వేయడం స‌రైందేన‌ని, త‌మ‌ హోటల్‌లో స‌ర్వీసుకు తగ్గట్టుగానే ధర ఉందని సమర్ధించుకుంది. ఇరు ప‌క్షాల‌ వాదనలు విన్న అనంతరం అహ్మదాబాద్ కోర్టు రెండు రోజుల కిందట తుది తీర్పు వెల్ల‌డించింది. ఎమ్మార్పీ కంటే భారీ మొత్తాన్ని వసూలు చేశారని, ధ‌ర వేయ‌డం స‌రికాద‌ని కోర్టు అభిప్రాయపడింది. సాధారణ నీళ్ల సీసాకు అంత ధర ఉండటం అన్యాయమని స్ప‌ష్టం చేసింది. అంతేకాదు, రోహిత్ పాటిల్‌ను హోటల్ సిబ్బంది వేధింపులకు గురిచేశారని, అందుకు రూ.2,500 చెల్లించాలని ఆదేశించింది. ఇతర ఖర్చులకు రూ.3,000 క‌లిపి బాధితుడికి పరిహారంగా రూ.5,500 నెల‌రోజుల్లో ఇవ్వాలని కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. కన్జ్యూమర్ కోర్టు త‌న‌కు అనుకూలంగా తీర్పు ఇవ్వ‌డంతో రోహిత్ హ‌ర్షం వ్య‌క్తం చేశాడు.

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM