చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

by సూర్య | Wed, Jan 13, 2021, 12:24 PM

రైతులు ఎక్కడా ఆనందంగా లేరని, వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రైతు వ్యతిరేక బిల్లులను భోగిమంటలో వేసి తగుల బెట్టిన టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మకర సంక్రాంతి మొదటిరోజు భోగి పండుగ సందర్భంగా బుధవారం కృష్ణా జిల్లాలోని పరిటాల గ్రామంలో ఏర్పాటు చేసిన భోగిమంటల కార్యక్రమంలో పాల్గొన్నారు. భోగిపండుగ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రైతు వ్యతిరేక బిల్లులను భోగి మంటల్లో వేసి తగులబెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతు కన్నీరు రాష్ట్రానికి దేశానికి మంచిది కాదన్నారు. కష్టాల్లో ఉన్న రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ... పాదయాత్రలో ప్రజలకు ముద్దులు పెట్టిన జగన్‌ ఇప్పుడేమో పిడిగుద్దులు గుద్దుతున్నాడని విమర్శించారు. ప్రజావేదికను కూల్చి శాడిస్టుగా వ్యవహరించారని మండిపడ్డారు. ‘‘ఏడు వరుస విపత్తులతో రైతులు నష్టపోతే పరిహారం ఇవ్వలేదు. అసత్యాలతో రైతులను దగా చేస్తున్నారు. రైతుల కోసం నేను పోరాడుతుంటే మైనింగ్‌ మాఫియా, బెట్టింగ్‌, బూతుల మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు’’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిటాల పేరు చెప్పగానే తొలుత కోహినూరు వజ్రం గుర్తుకు వస్తుందన్నారు.
రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపై ఇప్పటికే రూ.70వేల భారం మోపారని చంద్రబాబు ధ్వజమెత్తారు. కుటుంబంలో నలుగురు ఉంటే రూ.2.80లక్షల భారం పడిందన్నారు. ఈ భారం జీవితాంతం మోస్తూ ఊడిగం చేసే పరిస్థితి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ నాటకాలు నమ్మి పూనకం వచ్చినట్టు ఓట్లేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తానేం తప్పు చేశానో తెలీదన్న చంద్రబాబు.. ప్రజలంతా అభివృద్ధి చెందాలని కృషి చేశానని స్పష్టం చేశారు. అదే తాను చేసిన తప్పయితే క్షమించాలని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రెండు కళ్లయిన అమరావతి, పోలవరాన్ని పొడిచేశారని మండిపడ్డారు. రూ.1.30లక్షల కోట్ల అప్పు, రూ.70వేల కోట్ల పన్నులు మోపారని ధ్వజమెత్తారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM