అక్కడ జనవరి 14 వరకు భారీవర్షాలు

by సూర్య | Tue, Jan 12, 2021, 04:09 PM

తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం భారీవర్షాలు కురుస్తున్నాయి. జవనరి 14వతేదీ వరకు తమిళనాడులో భారీవర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. మంగళవారం తమిళనాడులోని అతిరామపట్నంలో 13.5 సెంటీమీటర్లు, అరియలూరులో 10 సెంటీమీటర్లు, నాగపట్నంలో 8 సెంటీమీటర్లు, కరైకల్ లో 6.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళ, బుధవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం కురవవచ్చని చెన్నైలోని వాతావరణ కేంద్రం తన వెదర్ బులిటిన్ లో వెల్లడించింది. కన్యాకుమారి, మధురై, తేని, పుదుక్కొట్లై, శివగంగై జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. తిరునెల్వేలి, తూత్తుకుడి, విరుదునగర్, రామనాథపురం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.

Latest News

 
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్ Fri, May 03, 2024, 10:47 PM
మద్దెలచెరువు సూరి హత్య కేసులో సంచలనం.. భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష Fri, May 03, 2024, 10:41 PM
ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Fri, May 03, 2024, 10:36 PM
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ Fri, May 03, 2024, 10:32 PM