అమెరికాలో గొరిల్లాలకు కరోనా

by సూర్య | Tue, Jan 12, 2021, 02:39 PM

అమెరికాలో గొరిల్లాలకు కూడా కరోనా సోకింది. కాలిఫోర్నియాలోని శాన్ డీగో జూలో రెండు గొరిల్లాలు కరోనా బారిన పడ్డాయి. గతవారం నుంచి అవి దగ్గుతూ ఇబ్బందిపడ్డాయని, మరో గొరిల్లాలో కూడా అలాంటి లక్షణాలు కనిపించాయని క్యూరేటర్ చెప్పారు. గొరిల్లాలకు కరోనా సోకడం ఇదే తొలిసారి. వీటికి జూ వర్కర్ నుంచి వైరస్ సంక్రమించి ఉంటుందని భావిస్తున్నారు. మొత్తానికి కరోనా సోకిన ఆ రెండు గొరిల్లాలూ బాగానే ఉన్నాయని, ఆ రెండింటినీ క్వారంటైన్ లో ఉంచామని కాలిఫోర్నియా గవర్నర్ తెలిపారు. త్వరలో ఇవి కోలుకుంటాయని భావిస్తున్నామన్నారు. మనుషులతో పోలిస్తే గొరిల్లాల డీఎన్ఏ 98 % సరిపోలుతుంది. ఈ జూలోకి సందర్శకులకు ప్రస్తుతం అనుమతించడం లేదు.

Latest News

 
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం Mon, Apr 29, 2024, 01:45 PM
వైసిపి పాలనలో పేద ప్రజలు దగా పడ్డారు.. కోండ్రు మురళీ Mon, Apr 29, 2024, 01:41 PM
వైసీపీలో చేరిన జువారి రమణారెడ్డి Mon, Apr 29, 2024, 01:38 PM
వైసీపీ మేనిఫెస్టోపై బీటెక్ రవి కీలక వ్యాఖ్యలు Mon, Apr 29, 2024, 01:36 PM
టిడిపిలో చేరిన వైసీపీ యువకులు Mon, Apr 29, 2024, 01:34 PM