సినిమా ఛాన్స్ కోసం వ్యభిచార కూపంలో చిక్కుకున్న మోడల్స్

by సూర్య | Tue, Jan 12, 2021, 12:34 PM

అది ఓ స్టార్ హోటల్. ఇద్దరు అమ్మాయిల పేరిట రూమ్స్ బుక్కయ్యాయి. వాళ్లంతా మోడల్స్ లా ఉన్నారు. ఆ తర్వాత విజిటర్స్ అంటూ వాళ్ల గదుల్లోకి కొందరు వ్యక్తులు రావడం మొదలయింది. ఆ స్టార్ హోటల్లో ఒకరికి అనుమానం వచ్చింది. అంతే, వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. పోలీసులు అత్యంత వేగంగా ఆ స్టార్ హోటల్ వద్దకు వచ్చారు. అతడు చెప్పిన రూమ్స్ పై అటాక్ చేశారు. మొత్తానికి అక్కడ జరిగేది వ్యభిచారమే అని తేల్చారు. విటులను అరెస్ట్ చేశారు. అక్కడ ఉన్న అమ్మాయిలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే పోలీసుల విచారణలో ఓ షాకింగ్ నిజం తెలిసింది. వాళ్లకు సినిమా ఛాన్స్ ఇప్పిస్తామని రప్పించి, ఇలా వ్యభిచారం చేయిస్తున్నారన్న నిజం బయటపడింది. చెన్నైలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై సిటీలో తెయ్నంపేట్ పరిధిలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఇద్దరు యువతుల పేరిట రూమ్స్ ను బుక్ చేశారు. వారి గదుల్లోకి కొందరు వ్యక్తులు వచ్చి పోతుండటంతో హోటల్ సిబ్బంది ఒకరికి అనుమానం వచ్చింది. దీంతో అతడు పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. పోలీసులు వచ్చి తనిఖీలు చేస్తే అసలు విషయం బయటపడింది. ఇద్దరు విటులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు నిర్వాహకులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరితోపాటు ఢిల్లీకి చెందిన సూరజ్ మల్హోత్రా, రాహూల్ అనే వ్యక్తులు ఈ వ్యభిచారం దందాలో కీలక పాత్రధారులని విచారణలో తేలింది. పోలీసులు వచ్చే లోపే వారు అక్కడి నుంచి పరారయ్యారు.


 


పోలీసుల విచారణలో మరో షాకింగ్ నిజం తెలిసింది. ఢిల్లీలోని మోడల్స్ ను సంప్రదించి, వారితో మాట్లాడి సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తామని వీళ్లు నమ్మించేవారు. వీళ్ల మాటలు నమ్మిన వాళ్లను చెన్నైకు రప్పిస్తారు. సినిమా వాళ్లతో పరిచయాలు ఉన్నాయనీ, వీళ్లతో కాస్త సన్నిహితంగా ఉంటే ఛాన్స్ ఈజీగా వస్తుందంటూ నమ్మబలికి నెమ్మదిగా వాళ్లను వ్యభిచారులుగా మార్చేవారు. ఇక చివరకు చేసేదేమీ లేక, తప్పక, వాళ్ల బెదిరింపులకు భయపడి కొందరు యువతులు వ్యభిచారం వృత్తిలోనే కొనసాగేవాళ్లు. అలా సినిమా ఛాన్స్ ఇప్పిస్తామని చెప్పే, తమను ఢిల్లీ నుంచి తెప్పించారని హోటల్లో పట్టుబడిన ఇద్దరు యువతులు పోలీసులకు చెప్పి వాపోయారు. దీంతో వారిని రెస్క్యూ హోంకు తరలించారు. తప్పించుకున్న ఇద్దరు నిర్వాహకులను వెతుకుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి వారిని నమ్మి మోసపోవద్దంటూ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు.

Latest News

 
షర్మిలను మిస్ అవుతున్నా.. పార్టీలోకి చేరుంటే.. జగన్ ఎమోషనల్ Sat, May 04, 2024, 08:32 PM
ప్రకాశం జిల్లా తీర్పు విభిన్నం.. 12 నియోజకవర్గాల బరిలో ఎవరెవరు Sat, May 04, 2024, 07:47 PM
గుంటూరు జిల్లాలో గెలిచే పార్టీదే అధికారం.. 17 నియోజకవర్గాల బరిలో ఎవరెవరు? Sat, May 04, 2024, 07:42 PM
టీటీడీకి అశోక్ లేలాండ్ కంపెనీ భారీ విరాళం Sat, May 04, 2024, 07:36 PM
నెల వ్యవధిలో రెండుసార్లు.. తనిఖీ చేసిన పోలీసులకే షాక్.. కళ్లు జిగేల్ Sat, May 04, 2024, 07:33 PM