మీకు ఈ డెడ్ లైన్స్ గుర్తున్నాయా?

by సూర్య | Tue, Jan 12, 2021, 12:59 PM

ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన డెడ్ ‌లైన్స్ సమీపిస్తున్నాయి. ఆ డెడ్‌లైన్స్ ఏవో తెలుసుకొని, చివరి తేదీ వరకు ఆగకుండా మీ పనులను త్వరగా పూర్తి చేసుకోండి.
2021 జనవరి 15: ఈ తేదీ ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశీయ, అంతర్జాతీయ లావాదేవీలకు సంబంధించిన ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్స్ 2021 జనవరి 15 లోగా సబ్మిట్ చేయాలి.
2021 జనవరి 31: వివాద్ సే విశ్వాస్ స్కీమ్ ‌లో భాగంగా డిక్లరేషన్ ఫైల్ చేయడానికి ఇది చివరి తేదీ. ఆదాయపు పన్ను వివాదాలను, పెండింగ్ ‌లో ఉన్న ట్యాక్స్ లిటిగేషన్ ‌లను పరిష్కరించేందుకు 2020 బడ్జెట్‌ లో ప్రభుత్వం ఈ స్కీమ్ ను ప్రకటించింది.
2021 ఫిబ్రవరి 15: ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 90ఈ కింద రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిన వారికి, అకౌంట్స్ ఆడిట్ చేయాల్సిన వారికి 2021 ఫిబ్రవరి 15 చివరి తేదీ.
2021 ఫిబ్రవరి 28: పెన్షన్ పొందుతున్నవారు తమ లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయడానికి ఇది చివరి తేదీ. ఈ గడువు గతంలోనే ముగిసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం 2020 నవంబర్ 30 నుంచి 2021 ఫిబ్రవరి 28 తేదీకి గడువు పొడిగించింది.
2021 మార్చి 15: డివిడెండ్ ద్వారా వచ్చే ఆదాయం 2020 ఏప్రిల్ 1 నుంచి పన్ను పరిధిలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.5,000 కన్నా ఎక్కువ డివిడెండ్ వస్తే పన్ను చెల్లించాలి. ఇందుకు సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్స్ 2021 మార్చి 15 లోగా చేయాలి.
2021 మార్చి 31: పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ నెంబర్లు లింక్ చేయడానికి 2021 మార్చి 31 చివరి తేదీ. ఈ గడువు 2020 జూన్ 30న ముగియడంతో గడువును 2021 మార్చి 31 తేదీ వరకు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. అప్పట్లోగా పాన్, ఆధార్ నెంబర్లను లింక్ చేయకపోతే పాన్ కార్డు పనిచేయదు.
2021 మార్చి 31: ఎల్‌టీసీ క్యాష్ వోచర్ స్కీమ్ ద్వారా పన్ను మినహాయింపు పొందేందుకు ఈ తేదీ చివరి తేదీ. కేంద్ర ప్రభుత్వం 2020 అక్టోబర్‌ లో ఈ స్కీమ్ ను ప్రకటించింది. మొదట కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ స్కీమ్ ప్రకటించింది. ఆ తర్వాత ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులకు కూడా ఈ స్కీమ్ ను అమలు చేసింది.
2021 మార్చి 31: 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రివైజ్డ్, బిలేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఈ తేదీ చివరి తేదీ. రూ.10,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. రూ.5,00,000 లోపు ఆదాయం ఉన్నవారు రూ.1,000 జరిమానా చెల్లించాలి.
2021 మార్చి 31: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ట్యాక్స్ సేవింగ్స్ చేయడానికి 2021, మార్చి 31 చివరి తేదీ.
2021 మార్చి 31: వివాద్ సే విశ్వాస్ స్కీమ్‌కు సంబంధించి పేమెంట్స్ చేయడానికి ఈ తేదీ చివరి తేదీ. అంటే 2021 జనవరి 31 లోగా డిక్లరేషన్ ఇచ్చి 2021 మార్చి 31లోగా పేమెంట్ చేయాలి.
2021 మార్చి 31: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ 2021 మార్చి 31న ముగుస్తుంది. ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 2020 మే 13న ఈ స్కీమ్ ప్రకటించింది.
2021 మార్చి 31: ఎల్‌టీసీ క్యాష్ వోచర్ స్కీమ్‌లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ ద్వారా రూ.10,000 పొందేందుకు 2021 మార్చి 31 చివరి తేదీ. ఈ మొత్తాన్ని 10 వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది.
2021 మార్చి 31: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన స్కీమ్‌లో భాగంగా క్రెడిట్ సబ్సిడీ పొందేందుకు 2021 మార్చి 31 లాస్ట్ డేట్. మిడిల్ ఇన్‌కమ్ గ్రూప్స్ అంటే రూ.6,00,000 నుంచి రూ.18,00,000 మధ్య వార్షికాదాయం ఉన్నవారు సబ్సిడీ పొందొచ్చు.
2021 జూన్ 30: కొత్త ఇల్లు కొని పన్ను లాభాలు పొందేందుకు ఇది చివరి తేదీ. రూ.2 కోట్ల లోపు మొదటిసారి ఇల్లు కొనేవారికి ఇది వర్తిస్తుంది.
2021 జూలై 31: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఇది చివరి తేదీ.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM