శివ‌సేన సీనియ‌ర్ నాయ‌కుడు క‌న్నుమూత‌

by సూర్య | Tue, Jan 12, 2021, 11:40 AM

ముంబై: మ‌హారాష్ట్ర‌లో శివ‌సేన పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, భారతీయ కామ్‌గార్ సేన అధ్య‌క్షుడు సూర్య‌కాంత్ మ‌హ‌దిక్ క‌న్నుమూశారు. ఇటీవ‌ల స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌కు గురైన ఆయ‌న ఈ ఉద‌యం తుదిశ్వాస విడిచారు. కాగా మ‌హ‌దిక్ మృతిప‌ట్ల మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్ థాక్రే తీవ్ర విచారం వ్య‌క్తంచేశారు. సూర్యకాంత్ మ‌హ‌దిక్ మృతివార్త త‌న‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఉద్ద‌వ్ థాక్రే పేర్కొన్నారు. భారతీయ కామ్‌గార్ సేన ద్వారా కార్మికుల హ‌క్కుల కోసం ఆయ‌న ఎన‌లేని పోరాటం చేశార‌ని కొనియాడారు. సూర్య‌కాంత్ మ‌హ‌దిక్ కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు.   

Latest News

 
అందుక‌నే బయటకు వచ్చేశా: అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 12:08 PM
ఆ ఫైలు మీద‌నే తొలి సంతకం: నారా లోకేశ్ Sun, Apr 28, 2024, 12:07 PM
ఆడారిని గెలిపించి అభివృద్ధికి బాటలు వేయండి Sun, Apr 28, 2024, 12:06 PM
దక్షిణలో ఫ్యాన్ గాలులు: వాసుప‌ల్లి Sun, Apr 28, 2024, 12:06 PM
పిఠాపురంలో రెండు రోజులు పవన్ పర్యటన Sun, Apr 28, 2024, 10:22 AM