షాకింగ్.. కరోనా ప్రమాదం వారికే ఎక్కువ!

by సూర్య | Mon, Jan 11, 2021, 05:11 PM

డయాబెటిస్ నివారణకు మందులు వాడేవారిపై కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోందని పరిశోధకులు తేల్చారు. న్యూస్ 18 కథనం ప్రకారం.. శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించేందుకు SGLT2i మందులు వాడే వారికి కరోనా ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని అమెరికాలోని బ్రిఘం అండ్ ఉమెన్స్ హాస్పిటల్ కు చెందిన నిపుణులు చేసిన పరిశోధనలో తేలింది. ఈ అధ్యయనాన్ని అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజిస్ట్స్ క్లినికల్ కేస్ రిపోర్ట్స్ జర్నల్‌ లో ప్రచురించారు.
కరోనా సోకిన డయాబెటిస్ రోగులు SGLT2i మందులను తీసుకుంటే.. వారిలో EUDKA అనే మరో అనారోగ్య లక్షణం కనిపిస్తోందని, DKA ఉన్నవారితో పోలిస్తే, EUDKA ఉన్నవారిలో చక్కెర స్థాయులు తక్కువగా ఉంటాయని పరిశోధకులు తేల్చారు. వీరికి కోవిడ్-19 సోకితే తీవ్రమైన పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఈ అధ్యయనం కోసం ఇటీవల euDKA బారిన పడ్డ ఐదుగురిపై పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనలను బట్టి SGLT2 మందులు DKA, euDKAలకు కారణమవుతాయని తేలిందని అధ్యయన బృంద సభ్యుడు నవోమి ఫిషర్ తెలిపారు. ఒకవేళ ఆకలి తగ్గిపోవడం, ఇతర అనారోగ్యాలు ఎదురైతే మందుల వాడకాన్ని ఆపేయాలి. వారు కోలుకొని ఆహారం తీసుకునేంత వరకు మెడిసిన్ తీసుకోకపోవడమే మంచిదని ఫిషర్ చెప్పారు. కరోనా వైరస్ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను నాశనం చేస్తుంది. అందువల్ల కోవిడ్-19 euDKA ప్రమాదాలను పెంచుతుందని పరిశోధకులు అనుమానిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కరోనా వంటి అనారోగ్యాల బారిన పడినప్పుడు SGLT2i వాడకాన్ని ఆపాలని ఫిషర్ తెలిపారు.

Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM