గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు గుడ్ న్యూస్

by సూర్య | Mon, Jan 11, 2021, 04:07 PM

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త. ఇప్పుడు మీరు గ్యాస్ సిలిండర్ పై రూ.50 క్యాష్ బ్యాక్ పొందొచ్చు. ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన పాకెట్స్ వాలెట్ లో గ్యాస్ సిలిండర్‌ బుక్ చేసే వారికి ఈ క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది.
పాకెట్స్ వాలెట్ ప్రకారం.. గ్యాస్ బుకింగ్‌ను మీరు ఏ మొబైల్ నంబర్ ద్వారా చేపడతారో.. అదే నంబర్ ‌కి క్యాష్ బ్యాక్ వర్తిస్తుంది. గ్యాస్ బుకింగ్ ఎవరి పేరు మీద ఉంటే.. వారు తమ మొబైల్ ‌లో ఈ యాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. జనవరిలో మొదటిసారి ఈ యాప్ వాడేవారికి ఈ ఆఫర్ లభిస్తుంది. మీరు క్యాష్ బ్యాక్ పొందేందుకు బుక్ చేసుకునే సమయంలో.. ప్రోమో కోడ్ PMRJAN2021 ను ఎంటర్ చేయాలి. ఈ ఆఫర్ 2021 జనవరి 25 వరకు అమల్లో ఉంటుంది. ఈ ప్రోమో కోడ్‌ ని నెలకు మూడుసార్లు వాడవచ్చు.
గ్యాస్ సిలిండర్ ఇలా బుక్ చెయ్యండి:
- ముందుగా పాకెట్స్ వాలెట్ యాప్ ను డౌన్‌ లోడ్ చేయాలి.
- యాప్ ఇన్‌ స్టాల్ అయ్యాక.. యాప్ ఓపెన్ చేసి, పే బిల్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి
- అక్కడ మీకు మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి .
- అక్కడ మీకు గ్యాస్ బుకింగ్ ఆప్షన్ కనిపిస్తుంది.
- అక్కడ మీరు మీ గ్యాస్ బండ సర్వీస్ అందించే కంపెనీని ఎంచుకోవాలి.
- ఆ తర్వాత వినియోగదారుడి నంబర్, డిస్ట్రిబ్యూటర్ ఐడీ, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.
- తర్వాత PMRJAN2021 ప్రోమో కోడ్ ఎంటర్ చేయాలి.
- దీంతో మీకు గ్యాస్ బండ బుకింగ్ జరుగుతుంది.
- ఇప్పుడు మీరు బుకింగ్ అమౌంట్ చెల్లించాలి.
- ఆ తర్వాత మీకు రూ.50 క్యాష్ బ్యాక్ డబ్బులు మీ అకౌంట్‌ లో క్రెడిట్ అవుతాయి. 10 రోజుల్లో ఈ డబ్బు జమ అవుతుంది.

Latest News

 
మే 3న రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని Fri, Apr 26, 2024, 03:27 PM
1న ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చెయ్యాలి Fri, Apr 26, 2024, 03:25 PM
కొడాలి నాని నామినేషన్ తిరష్కారించాలి Fri, Apr 26, 2024, 03:24 PM
పీయూష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం Fri, Apr 26, 2024, 03:23 PM
అటునుండి ఇటు , ఇటునుండి అటు Fri, Apr 26, 2024, 03:22 PM