9 రాష్ట్రాలకు విస్తరించిన బర్డ్ ఫ్లూ..

by సూర్య | Mon, Jan 11, 2021, 02:18 PM

దేశంలో ఇప్పటికే 7 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. తాజాగా మహారాష్ట్ర, ఢిల్లీలోనూ బర్డ్‌ ఫ్లూ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా బర్డ్‌ ఫ్లూ సోకిన రాష్ట్రాల సంఖ్య 9కి చేరింది. ఫ్లూ నేపథ్యంలో పంజాబ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌ లు పౌల్ట్రీ ఉత్పత్తుల రవాణాను నిలిపివేశాయి.
మహారాష్ట్రలోని పర్బనీ ప్రాంతంలో రెండు రోజుల్లోనే దాదాపు 800 కోళ్లు, పక్షులు మృతిచెందాయి. మురుంబా గ్రామంలో 8 కోళ్ల ఫారాలలో 8 వేల కోళ్లు ఉన్నాయని.. వాటిని చంపేయాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు అక్కడి కలెక్టర్‌ మీడియాకు చెప్పారు. ఫ్లూ నేపథ్యంలో చత్తీస్‌గడ్‌ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఈ మేరకు అక్కడ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. ఫ్లూ విస్తరిస్తున్ననేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టింది. నివారణ మందుపై సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కానున్నారు. మొట్టమొదటిసారిగా బర్డ్‌ ఫ్లూ 2006లో వెలుగులోకి వచ్చింది.

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM