ఎస్ఈసీ కీలక నిర్ణయం..ఆ అధికారిపై వేటు

by సూర్య | Mon, Jan 11, 2021, 02:29 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్‌పై ఎస్ఈసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. జీవీ సాయిప్రసాద్ 30 రోజుల పాటు సెలవులపై వెళ్లారు. ఇతర ఉద్యోగులను సైతం సెలవుపై వెళ్లేలా ప్రభావితం చేశారని జీవీ సాయిపై అభియోగాలు ఉన్నాయి. క్రమశిక్షణారాహిత్యంగా ఎన్నికల కమిషన్ పరిగణించింది. ప్రస్తుత ఎన్నికలకు విఘాతం కలిగించేలా చర్యలున్నాయని ఎస్ఈసీ పేర్కొంది. జీవీ సాయిప్రసాద్‌ విధుల నుంచి తొలగించింది. ప్రభుత్వ సర్వీసుల్లో ప్రత్యేక్షంగా గానీ, పరోక్షంగా గానీ విధులు నిర్వహించడానికి వీలులేదని ఎస్ఈసీ స్పష్టం చేసింది.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM