శ్రీశైలం ఆలయంలో నేటి నుంచి మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

by సూర్య | Mon, Jan 11, 2021, 02:12 PM

కర్నూలు : శ్రీశైలం ఆలయంలో నేటి నుంచి మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఆలయంలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. నేటి సాయంత్రం 5 గంటల నుంచి అంకురారోపణ ధ్వజారోహణ ప్రత్యేక పూజలు నిర్వహించున్నారు. కోవిడ్ నివారణలో భాగంగా ఈ సంవత్సరం స్వామి అమ్మవార్ల గ్రామోత్సవాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేయనున్నట్టు ఈఓ కెఎస్ రామారావు తెలిపారు. ఆలయ మాడ వీధులలో శ్రీస్వామి అమ్మవార్ల ఊరేగింపు ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ శ్రీస్వామి అమ్మవార్లకు విశేష పూజలు, వాహనసేవలు నిర్వహించనున్నారు.


నేటి నుంచి 17వ తేదీ వరకు ఆర్జిత హోమాలైన రుద్రహోమం, మృత్యుంజయ హోమం, చండీ హోమం స్వామి అమ్మవార్ల కల్యాణం, ఏకాంతసేవలను నిలపుదల చేయనున్నట్టు ఈఓ కెఎస్ రామారావు తెలిపారు.


 


బ్రహ్మోత్స‌‌వాల షెడ్యూల్..


 


• శ్రీశైలంలో ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న సంక్రాంతి బ్రహ్మోత్సవాలు


• ఈ నెల 17న ముగియనున్న సంక్రాంతి బ్రహ్మోత్సవాలు


• ఈ ఉదయం 8.30 గంటలకు యాగశాల ప్రవేశం


• ఈ సాయంత్రం 5.00గంటల నుండి అంకురారోపణ ధ్వజారోహణ కార్యక్రమాలు


• కోవిడ్ నివారణ చర్యలు పాటిస్తూ ఉత్సవాల నిర్వహణ


• కోవిడ్ నివారణలో భాగంగా ఈ సంవత్సరం గ్రామోత్సవం నిలుపుదల


• ప్రాకారోత్సవములో ఆలయమాడవీధులలో శ్రీస్వామిఅమ్మవార్ల ఊరేగింపు


• ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు, వాహనసేవలు,


• 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు ఆర్జిత హోమాలైన రుద్రహోమం, మృత్యుంజయహోమం, చండీహోమం మరియు స్వామిఅమ్మవార్లకల్యాణం, ఏకాంతసేవలను నిలపుదల


• 13వ తేదీన ఉదయం ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో సామూహిక భోగిపండ్ల కార్యక్రమం


• 14వ తేదీన మహిళలకు ముగ్గులపోటీలు


• 16వ తేదీన వేదసభ కార్యక్రమం


• కనుమ పండుగ రోజున (15.01.2021) సంప్రదాయబద్దంగా గో పూజ మరియు బాలబాలికలకు వ్యాసరచన, వకృత్త్వ (ఉపన్యాస) పోటీలు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM