బంగారం-వెండి నాణేల కోసం నదిని తవ్వేస్తున్న జనం

by సూర్య | Mon, Jan 11, 2021, 01:39 PM

బంగారం, వెండి నాణేలు లభ్యమవుతున్నాయని ఒక పుకారు షికారు చేసింది. అంతే ఇంకేముంది. ఈ వార్త దావానంల వ్యాపించడంతో ప్రజలు ఆశతో పరుగులు తీశారు. నదిలో నాణేల కోసం గాలింపు చేపట్టారు. అక్కడక్కడ తవ్వకాలు కూడా జరిపారు. ఈ ఆసక్తికర ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఎనిమిది రోజుల క్రితం కొంతమంది మత్స్యకారులకు రాజ్‌ఘర్ జిల్లాలోని పార్వతి నదితో బంగారు, వెండి నాణేలు లభించాయి.
ఈ విషయం స్థానికంగా ఉండే అందరికీ తెలిసింది. అంతేకాదు పక్క గ్రామాల ప్రజలకు తెలిసింది. దీంతో రాజ్‌ఘర్ జిల్లాలోని శివపుర, గరుద్‌పూరా గ్రామస్తులు పెద్ద ఎత్తున పార్వతి నది పరిసర ప్రాంతాలకు చేరుకుని నాణేల కోసం వేట ప్రారంభించారు. నీళ్లలోకి దిగి కొందరు బురద ఎత్తిపోస్తూ నాణేల కోసం వెతుకుతుండగా ఒడ్డునే ఉన్న బురద పెల్లలను తొలగిస్తూ మరి కొందరు ఆ నాణేల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Latest News

 
ఏపీ సీనియర్ ఏబీ వెంకటేశ్వరరావుకు మరో టెన్షన్.. మరో 2 వారాలే, కష్టమేనా Sat, May 18, 2024, 10:21 PM
తెలుగుదేశం ఆఫీసులో వైఎస్ జగన్ ఎయిర్‌పోర్ట్ ఘటన డాక్టర్.. సంచలన ఆరోపణలు Sat, May 18, 2024, 10:16 PM
సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో కలకలం.. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద వ్యక్తి Sat, May 18, 2024, 09:01 PM
తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు.. కోర్టుకెళ్లి మరీ సాధించుకున్న ఇద్దరు భక్తులు Sat, May 18, 2024, 09:00 PM
లండన్ పర్యటకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ Sat, May 18, 2024, 08:52 PM