గుర్రంపై అత్యాచారం..ఆపై వీడియోతీసి నీచం

by సూర్య | Mon, Jan 11, 2021, 12:40 PM

ఇంగ్లండ్ లో ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. గుర్రంపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒకసారి అదే మూగజీవిపై అత్యాచారం చేసి జైలుకెళ్లొచ్చినా అతడి ప్రవర్తనలో మార్పురాలేదు. మరోసారి కృరంగా గుర్రంపై విరుచుకుపడ్డాడు. అంతేకాదు ఆ పాడుపనికి సంబంధించి వీడియో తీసి పైశాచిక ఆనందం పొందాడు. నిందితుడు పేరు ఇసాక్ క్లోలీ(22). లైసెస్టర్ లో 2020లో గుర్రంతో శృంగారం చేస్తూ మొబైల్ ఫోన్‌తో వీడియో రికార్డ్ చేశాడు. ఆ వీడియో చూస్తూ పైశాచిక ఆనందం పొందాడు.
అయితే ఓ రోజు ఫ్రెండ్ అడిగితే ఫోన్ ఇచ్చాడు. అయితే ఆ మెుబైల్ లో ఆ వీడియో ఉన్న విషయం మరచిపోయాడు. అయితే ఫ్రెండ్ ఆ వీడియో చూశాడు. ఆ వీడియోని చూపించి ఫ్రెండ్ నిలదీశాడు. “లైట్ తీసుకో”అన్నాడు కామాంధుడు. కానీ ఆ ఫ్రెండ్ మాత్రం ఊరుకోలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు క్లోలీని అరెస్టు చేశారు. 2003 నాటి సెక్సువల్ నేరాల చట్టం ప్రకారం కేసులో క్లోలీని శనివారం మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. తప్పు జరిగిపోయిందనీ… తనను క్షమించమని వేడుకున్నాడు. అనంతరం మేజిస్ట్రేట్ కోర్టు ఈ కేసును లైసెస్టర్ క్రౌన్ కోర్టుకు బదిలీ చేసింది.
ఇదిలా ఉంటే కోర్టులో నానా రచ్చ చేశాడు క్లోలీ. తన నేరాన్ని ఒప్పుకోలేదు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని వాదించాడు. పోలీసులు ఆధారాలు చూపించే సరికి బిత్తరపోయాడు. మళ్లీ మద్యం మత్తులో అలా చేశానని కొత్తనాటకం ఆడాడు. అయితే ఆ సమయంలో మద్యం తాగి లేడని పోలీసులు తేల్చారు. మరోసారి తన మానసిక పరిస్థితి బాగోలేదని వాదించే ప్రయత్నం చేశాడు. వైద్యులు మాత్రం అతడి ఆరోగ్యం బాగుందని రిపోర్ట్ ఇచ్చారు. ఉద్దేశపూర్వకంగానే గుర్రంపై అత్యాచారం చేశాడని నిరూపించారు. ఇకపోతే గతంలో అంటే 2016లో గుర్రంపై అత్యాచారానికి పాల్పడినందుకు గానూ నాడు కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధించింది. జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ అదే నేరం చేశాడు. దీంతో ఈసారి అతడికి కఠిన శిక్ష పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Latest News

 
పల్నాడు జిల్లాలో నేడు కూడా 144 సెక్షన్ Fri, May 17, 2024, 12:43 PM
ఎవరెస్ట్, ఎండీఎచ్ మసాలాలపై నేపాల్ నిషేధం Fri, May 17, 2024, 12:40 PM
108 వాహనంలో కవలలు జననం Fri, May 17, 2024, 12:32 PM
యువతి అదృశ్యంపై కేసు నమోదు Fri, May 17, 2024, 12:31 PM
మరోసారి చరిత్ర సృష్టించబోతున్నాము Fri, May 17, 2024, 11:49 AM