ఢిల్లీకి పాకిన బర్డ్‌ ఫ్లూ

by సూర్య | Mon, Jan 11, 2021, 12:16 PM

న్యూఢిల్లీ: దేశంలో బర్డ్‌ ఫ్లూ కలకలం సృష్టిస్తున్నది. దేశ రాజధాని కూడా బర్డ్‌ ఫ్లూ విస్తరించింది. ఢిల్లీలో చనిపోయిన కాకులు, బాతులకు సంబంధించిన ఎనిమిది నమూనాలను భోపాల్‌లోని ల్యాబ్‌కు పంపించారు. అందులో బర్డ్‌ ఫ్లూ కారణంగానే అవన్నీ మరణించాయని తేలింది. దీంతో బర్డ్‌ ఫ్లూ కేసులు నమోదైన రాష్ట్రాల సంఖ్య తొమ్మిదికి చేరింది.   నిన్న సంజయ్‌ లేక్‌లో 17 బాతులు చనిపోయాయి. దీంతో అధికారులు అప్రమత్తయ్యారు. ఆప్రాంతంలో ఉన్న పార్కులను ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (డీడీఏ) మూసివేసింది. కాగా, గత కొన్నిరోజులుగా డీడీఏ పార్కుల్లో 14 చనిపోయిన కాకులను గుర్తించామని అధికారులు తెలిపారు. ఈనేపథ్యంలో హౌజ్‌ ఖాస్‌ పార్క్‌, ధ్వారకా సెక్టార్‌ 9 పార్క్‌, హస్తల్‌ పార్కులను శనివారం మూసివేశారు.  

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM