పల్స్‌ పోలియో వాయిదా.. ఎందుకంటే

by సూర్య | Mon, Jan 11, 2021, 12:12 PM

జనవరి 17 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించాల్సిన పల్స్‌ పోలియో చుక్కల మందు పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ నెల 16 నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్న నేపథ్యంలో.. ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండేందుకు పల్స్‌ పోలియా కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. టీకా పంపిణీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆరోగ్య సిబ్బంది పాల్గొంటారు. దీంతో వ్యాక్సినేషన్‌ కు సిబ్బంది కొరత ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పల్స్ పోలియో కార్యక్రమాన్ని మళ్లీ నిర్వహించే తేదీని త్వరలోనే వెల్లడిస్తామని కేంద్రం చెప్పింది.

Latest News

 
చంద్రబాబు మరో మాస్టర్ ప్లాన్.. ముందుగానే అలర్ట్, ఈసారి ఆ తప్పు జరగకుండా Thu, Apr 25, 2024, 07:45 PM
డిప్యూటీ సీఎంకు 'సన్' స్ట్రోక్.. వైసీపీ అభ్యర్థి, సోదరి అనురాధపై ఇండిపెండెంట్‌గా రవి నామినేషన్ Thu, Apr 25, 2024, 07:39 PM
ఉద్యోగిగా కొనసాగే అర్హత లేదు.. ఐఏఎస్‌ అధికారి గుల్జార్‌పై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం Thu, Apr 25, 2024, 07:35 PM
దర్శనానికి వచ్చి దేవుడి ఉంగరం దొంగిలిస్తారా?.. భక్తుల్ని స్తంభానికి కట్టేయడంతో కన్నీటి పర్యంతం Thu, Apr 25, 2024, 07:31 PM
వీళ్లా వైఎస్సార్ వారసులు?.. అవినాష్ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు,,,షర్మిల, సునీతలపై సీఎం జగన్ ఫైర్ Thu, Apr 25, 2024, 07:25 PM