రెండు స్వదేశీ టీకాలతో మానవాళి రక్షణకు భారత్ సంసిద్ధం : మోడీ

by సూర్య | Sun, Jan 10, 2021, 09:30 AM

మానవజాతిని రక్షించేందుకు రెండు స్వదేశీ టీకాలతో భారత్‌ సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్రవెూదీ అన్నారు.16వ ప్రవాసి భారతీయ దివస్‌ సదస్సును ప్రధాని వెూదీ నేడు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన టీకాల కోసం యావత్‌ ప్రపంచం ఎదురు చూస్తుండటమేగాక, అతిపెద్ద వ్యాక్సినేషన్‌ పక్రియను ఎలా నిర్వహిస్తామని ఆసక్తిగా తిలకిస్తోందని తెలిపారు. భారత్‌లో ప్రజాస్వామ్యం బలంగా ఉందన్నారు  గత కొన్ని సంవత్సరాలుగా నాన్‌ రెసిడెంట్‌ ఇండియన్స్‌ ఇతర దేశాల్లో మరింత బలోపేతం అయ్యారని తెలిపారు. దేశంలో కరోనా ప్రభావం మొదలైన కొత్తలో భారత్‌ పీపీఈ కిట్‌లను, మాస్కులను, వెంటిలేటర్‌లను, టెస్టింగ్‌ కిట్‌లను బయటి నుంచి దిగుమతి చేసుకునేదని, కానీ ఇప్పు డు ఆ విషయంలో   స్వావలంబన సాధించిందని ప్రధాని వెూదీ చెప్పారు.   భారత్‌ ఉగ్రవాదాన్ని ఎదుర్కోనేందుకు గట్టిగా నిలబడటంతో ఇప్పు డు ప్రపంచ మంతా ఉగ్రవాదాన్ని ఎదిరించే శక్తిసామర్థ్యాలను కూడగట్టుకున్నదని ప్రధాని   తెలిపారు.  కొవిడ్‌ను ఎదుర్కోవడంలో భారత్‌ ముందంజలో ఉందని వెూడీ అన్నారు. మహమ్మారి సమయంలో దేశ ప్రజలందరూ కలిసికట్టుగా ఉన్నారని కొనియాడారు. ప్రపంచంలోనే అత్యధిక రివకరీ రేటు.. అతి తక్కువ మరణాల రేటు ఉన్న దేశాల్లో  భారత్  ఒకటని చెప్పారు.


 


 

Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM