కొత్త జిల్లాలపై కమిటీ ప్రతిపాదన...

by సూర్య | Sun, Jan 10, 2021, 09:40 AM

కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం నియమించిన కమిటీ ప్రతిపాదనల ప్రకారం పార్లమెంట్ స్థానాలను ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించింది. కొత్తగా 57 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు చేయాలని సూచించింది. అరకును పాడేరు, పార్వతీపురం కేంద్రాలుగా రెండు జిల్లాల ఏర్పాటుచేయాలని పేర్కొంది. తాజాగా ఉన్నతస్థాయి కమిటీ ప్రతిపాదనల ప్రకారం విస్తీర్ణంలో అత్యంత చిన్న జిల్లా నరసాపురం (2,178), అత్యంత పెద్ద జిల్లా ఒంగోలు (13,407). జనాభా పరంగా విజయవాడలో అత్యధికంగా 22,18,579 మంది, అత్యల్పంగా అరకు-2లో 9,53,960 మంది ఉంటారు


ఉన్నతస్థాయి కమిటీ ప్రతిపాదనల ప్రకారం ఐదు మండలాలు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి. విజయనగరం జిల్లా జామి మండలానికి చెందిన 12 గ్రామాలు గజపతినగరం (ప్రతిపాదిత విజయనగరం జిల్లా), 16 గ్రామాలు ఎస్‌.కోట (ప్రతిపాదిత విశాఖపట్నం జిల్లా) అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి. విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం పరిధిలోని ఒక గ్రామం గాజువాక (ప్రతిపాదిత విశాఖపట్నం జిల్లా), మూడు గ్రామాలు పెందుర్తి నియోజకవర్గ (ప్రతిపాదిత అనకాపల్లి జిల్లా) పరిధిలోకి రానున్నాయి.


 


విజయవాడ రూరల్‌ మండలంలోని 8 గ్రామాలు మైలవరం (ప్రతిపాదిత విజయవాడ జిల్లా), 10 గ్రామాలు గన్నవరం నియోజకవర్గాల (ప్రతిపాదిత మచిలీపట్నం జిల్లా) పరిధిలోకి వస్తున్నాయి. తిరుపతి అర్బన్‌ పరిధిలోని 5 గ్రామాలు తిరుపతి (ప్రతిపాదిత తిరుపతి జిల్లా), రెండు గ్రామాలు చంద్రగిరి (ప్రతిపాదిత చిత్తూరు జిల్లా) నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి.


 


అనంతపురం జిల్లాలో అనంతపురం మండలంలోని ఐదు గ్రామాలు అనంతపురం అర్బన్‌ (ప్రతిపాదిత అనంతపురం జిల్లా), 15 గ్రామాలు రాప్తాడు (ప్రతిపాదిత హిందూపురం/ పెనుకొండ) నియోజకవర్గాల పరిధిలోకి రాబోతున్నాయి. వీటి విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని కమిటీ సూచించింది.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM