వామ్మో..! 100 రోజులు ఒకే డ్రెస్..

by సూర్య | Sat, Jan 09, 2021, 03:42 PM

ప్రస్తుత రోజుల్లో డ్రెస్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనిషి ధరించే డ్రెస్ ను బట్టి ఆ వ్యక్తికి గౌరవం కూడా రెట్టింపు అవుతుంది. అందుకే ఒకరోజు వేసుకున్న డ్రెస్ మరుసటి రోజు వేసుకోరు. కొంతమంది అయితే రోజుకొక డ్రెస్ మెయింటెనెన్స్ చేసేవారు కూడా ఉన్నారు. అయితే అమెరికాకు చెందిన ఓ మహిళ మాత్రం ఇందుకు భిన్నంగా వంద రోజులు ఒకే డ్రెస్‌ వేసుకుంది. ఫ్యాషన్లకు దూరంగా.. సింపుల్‌గా జీవించింది. వివరాల్లోకి వెళితే అమెరికాలోని బోస్టన్‌కు చెందిన 52 ఏళ్ల సారా రాబిన్స్‌ కోల్‌ ‘100 రోజులు.. ఒకే డ్రెస్‌’ చాలెంజ్‌ను స్వీకరించింది.
గత సెప్టెంబర్‌ నుంచి నిన్న మొన్నటి వరకు బ్లాక్‌ మెరినో ఊల్‌ డ్రెస్ వేసుకుంది‌. ఫ్యాషన్లకు దూరంగా ఉంటూ సాధారణ జీవితాన్ని గడిపింది. ఉద్యోగానికి.. చర్చికి.. ఆఖరికి కిస్మస్‌ పండుగ రోజు కూడా అదే బ్లాక్‌ డ్రెస్‌ వేసుకుంది. అయితే అప్పుడప్పుడు దాని మీదకు సరిపోయేలా రంగుల జాకెట్లు, ష్కర్టులు ధరించేది. ఈ 100 రోజుల చాలెంజ్‌ను ఓ డాక్యూమెంటరీగా రూపొందించింది. అంతే సోషల్‌ మీడియా సెలెబ్రిటీగా మారిపోయింది.
100 రోజులు ఒకే డ్రెస్‌ చాలెంజ్‌ తీసుకున్న వారిలో సారా మొదటి వారేమీ కాదు. ‘ఉల్‌ అండ్’‌ అనే వస్త్ర కంపెనీ ఈ చాలెంజ్‌ను తీసుకొచ్చింది. మేము రొవెనా స్వింగ్‌ డ్రెస్‌ను తయారు చేశాము. సాదాసీదాగా జీవించటం, జాగ్రత్తగా వాడుకోవటం, మంచిగా ఉంచుకోవటం.. వంటి సూత్రాలతో 100 రోజుల చాలెంజ్‌ను ఇస్తాము. మా చాలెంజ్‌ను స్వీకరించే 50 మందికి ఈ డ్రెస్‌ను పంపిస్తాము అని తమ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది

Latest News

 
నేడు కమలాపురం నియోజకవర్గంలో వైయస్ షర్మిల ప్రచారం Tue, May 07, 2024, 10:27 AM
వరదయ్యపాళెంలో గడ్డివామి దగ్ధం Tue, May 07, 2024, 10:19 AM
మరో వారం రోజుల్లో పోలింగ్.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు Mon, May 06, 2024, 09:47 PM
హీరో సాయి ధరమ్‌తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత.. కాన్వాయ్‌పైకి రాయి, ఒకరికి తీవ్ర గాయాలు Mon, May 06, 2024, 09:02 PM
నగరిలో టీడీపీకి జైకొట్టిన వైసీపీ కీలక నేతలు.. మంత్రి రోజాపై ఆగ్రహం Mon, May 06, 2024, 08:58 PM